ETV Bharat / bharat

'భారత్​ను అస్థిర పరిచేందుకు పాక్​ కుట్రలు'

భారత్​ను అస్థిర పరిచేందుకు పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటోందని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ విమర్శించారు. ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యలో ప్రయాణించారు మంత్రి. భద్రతా సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. తీరప్రాంతంలో భారత నౌకాదళం నిరంతరం అప్రమత్తంగా ఉంటోందని స్పష్టం చేశారు.

'భారత్​ను అస్థిర పరిచేందుకు పాక్​ కుట్రలు'
author img

By

Published : Sep 29, 2019, 12:24 PM IST

Updated : Oct 2, 2019, 10:46 AM IST

'భారత్​ను అస్థిర పరిచేందుకు పాక్​ కుట్రలు'

భారత తీర ప్రాంతానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. భారత్​ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్​ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

భారత పశ్చిమ తీర గస్తీ నౌక ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యలో ప్రయాణించారు కేంద్ర మంత్రి.

"ప్రపంచంలో ఏ దేశమైనా దాని భద్రత కోసం అవసరమైన రక్షణ సామర్థ్యాలను కలిగి ఉంది. ఉగ్రదాడులు జరిగే అవకాశాలను తోసిపుచ్చలేం. మన పొరుగుదేశం గురించి ప్రశ్న వచ్చినప్పుడు.. భారత్​ను అస్థిరపరిచి, విభజించాలనే ప్రయత్నాలు చేస్తుందని మీకు తెలుసు. ఎప్పుడూ దుర్మార్గపు చర్యలకు పూనుకుంటోంది. 26/11 ముంబయిలో జరిగిన దాడులను మరిచిపోలేం. ఒకసారి తప్పు జరిగి ఉండొచ్చు కానీ ఆ తప్పు మరోమారు జరగదు. భారత నావికాదళం, తీర రక్షక దళం​ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుున్నాయి.

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ శాఖ మంత్రి.

సైనికులతో యోగా..

ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యలో ప్రయాణించిన రాజ్​నాథ్​ సింగ్​ సైనికులతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రస్తుతం యోగాను ప్రపంచమంతా ఆచరిస్తోందని.. ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని అభిప్రాయపడ్డారు రాజ్​నాథ్​.

ఇదీ చూడండి: 'మత్తుతో చిత్తే... అందుకే ఈ-సిగరెట్లపై నిషేధం'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 2, 2019, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.