ETV Bharat / bharat

సామాజిక దూరంపై తిరుగుబాటు- గాల్లోకి కాల్పులు - assam police news

అసోంలోని బాంగైగాన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక దూరం విషయంలో​ పోలీసులు, స్థానికుల మధ్య జరిగిన గొడవ ఈ వివాదానికి కారణమైంది. చివరికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపితేనే పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Police personnel fired in the air at a market in Assam on Saturday morning after people pelted stones at them
పోలీసులపై స్థానికులు తిరుగుబాటు
author img

By

Published : Mar 28, 2020, 5:04 PM IST

Updated : Mar 28, 2020, 5:26 PM IST

సామాజిక దూరంపై తిరుగుబాటు- గాల్లోకి కాల్పులు

అసోంలో పోలీసులు, స్థానికులకు మధ్య తలెత్తిన గొడవలో... ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బాంగైగాన్ జిల్లాలోని ఓ మార్కెట్​లో ఈ ఘటన జరిగింది. మాంసం విక్రయ కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కరోనా నేపథ్యంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడం వల్ల పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఇరు వర్గాల ఘర్షణలో ఎవరికీ గాయాలు కాలేదు. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అదనపు బలగాలను మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో మోహరించారు.

శుక్రవారం దుబ్రి జిల్లా ఫొలిమరి బుద్ బరి మార్కెట్ వద్ద.. విధుల్లో ఉన్న పోలీసులపై వ్యాపారులు, స్థానికులు దాడి చేయడం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి...

Last Updated : Mar 28, 2020, 5:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.