మద్యం మత్తులో ఓ పోలీసు కానిస్టేబుల్ చేసిన పని.. అతని ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. ఎవరూ చూడలేదనుకుని ఏటీఎంలో మూత్రవిసర్జన చేసిన అతని వీడియో... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అది కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినందున.. ఈ ఘటనపై విచారణ జరిపారు. జుగుప్సాకరమైన పనిచేసినందుకు సమీర్సేథీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు.
ఇదీ జరిగింది..
ఒడిశా బరిపాడలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు సమీర్సేథీ. మద్యం మత్తులో ఎస్బీఐ ఏటీఎం కియోస్కులో మూత్రం పోశాడు. ఎవరూ చూడలేదనుకున్నాడు సమీర్. అయితే ఈ దృశ్యాన్ని స్థానిక వ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరించి, సమాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఫలితంగా సస్పెండ్ అయ్యాడు.
ఇదీ చూడండి: రూ.100 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన