పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)... పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీకి మరోమారు షాకిచ్చింది. భారత్తో పాటు విదేశాల్లోని సుమారు రూ.24.77 కోట్ల విలువైన చోక్సీ ఆస్తులను జప్తు చేసింది.
దుబాయిలో వ్యాపార సంబంధమైన మూడు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అందులో మెర్సిడీస్ బెంజ్ కారు, దేశ విదేశాల్లోని వివిధ బ్యాంకుల ఖాతాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అక్రమ నగదు బదిలీ నివారణ చట్టం కింద చర్యలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. ఈ కుంభకోణంలో ఛోక్సీ మొత్తం భాగం రూ.6,097.73 కోట్లుగా పేర్కొంది. ఇందులో ఇప్పటివరకు రూ.2,534.7 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది.
13 వేల కోట్ల పీఎన్బీ కుంభకోణంలో మెహుల్ ఛోక్సీ, నీరవ్ మోదీ, ఇతరులపై దర్యాప్తు చేపడుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 2018లో బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై సీబీఐతో పాటు ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి.
ఇదీ చూడండి: వైరల్: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా