ETV Bharat / bharat

ఆగస్ట్​ 15లోగా 2కోట్ల మందికి కిసాన్ మాన్​ధన్​ - రైతు

స్వాతంత్ర్య దినోత్సవంలోగా 'ప్రధానమంత్రి కిసాన్ మాన్​ ధన్ యోజన' కింద రెండు కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులను చేర్చుకోవాలని సీఎస్​సీ ఇ-గవర్నెన్స్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హులైన 60 ఏళ్లకు పైబడిన రైతులకు నెలకు రూ.3 వేలు పింఛను లభిస్తుంది. జమ్ము కశ్మీర్​, లద్ధాఖ్​ సహా దేశవ్యాప్తంగా ఈ పథకం అమలవుతుంది.

2 కోట్ల రైతులకు పీఎమ్​-కేఎమ్​వై
author img

By

Published : Aug 11, 2019, 7:01 PM IST

Updated : Sep 26, 2019, 4:23 PM IST

ఆగస్టు 15లోగా 'ప్రధానమంత్రి కిసాన్ మాన్ ​ధన్​ యోజన' కింద 2 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులను ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్​సీ) పథకంలో చేర్చుకోవాలని ఈ-గవర్నెన్స్​ సర్వీసెస్​ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా ఉమ్మడి సేవా కేంద్రాలను నిర్వహిస్తోంది.

రైతుకు పింఛన్​

'పీఎం-కేఎమ్​వై'ని దిల్లీలో శుక్రవారం వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్​ తోమర్​ ప్రారంభించారు. ఈ పథకం జమ్ముకశ్మీర్, లద్ధాఖ్​లతో సహా దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఫలితంగా ఆర్హులైన 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.3 వేలు పింఛను లభిస్తుంది.

పథకంలో చేరడం చాలా సులభం

అర్హత ఉన్న ఏ రైతు అయినా సమీపంలోని 'సీఎస్​సీ'కి వెళ్లి... ఆధార్​కార్డు, బ్యాంకు పాస్​బుక్​ లేదా ఖాతా వివరాలు సమర్పించి 'పీఎం-కేఎమ్​వై' పథకంలో సులభంగా చేరవచ్చు.

'సీఎస్​సీ'లను నిర్వహించే గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలు(వీఎల్​ఈ) రైతుల వివరాలన్నీ తీసుకున్న తరువాత ఆన్​లైన్​లో నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు.
ప్రామాణీకరణ ప్రక్రియ పూర్తయిన తరువాత.. నమోదు చేసుకున్న రైతుకు సమాచారం అందిస్తారు. వారికి ప్రత్యేకమైన పింఛను ఖాతా సంఖ్యతో 'పీఎమ్​-కేఎమ్​వై' పెన్షన్​కార్డు ఇస్తారు. 2019-20 బడ్జెట్​లో ప్రకటించిన విధంగా, వీరికి నెలకు రూ.3 వేలు చొప్పున పింఛను అందుతుంది.

ఎవరు అర్హులు

రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో చేరవచ్చు. వయస్సును అనుసరించి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం కూడా ప్రీమియంగా చెల్లిస్తుంది.

ఈ పథకం రిజిస్ట్రేషన్​ కోసం కామన్​ సర్వీస్ సెంటర్లు వసూలు చేసే 30 రూపాయల ప్రవేశ రుసుమునూ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 60 ఏళ్ల కంటే ముందే రైతు మరణిస్తే అతని భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తరువాత రైతు మరణిస్తే అతని భార్యకు 50 శాతం పింఛను అందుతుంది.

ఇదీ చూడండి: చైనాతో చర్చలు : బీజింగ్​లో జై శంకర్​

AP Video Delivery Log - 0500 GMT News
Sunday, 11 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0456: Malaysia Missing Girl AP Clients Only 4224572
Aerials of Malaysia area where UK teenager missing
AP-APTN-0435: Brazil Indigenous AP Clients Only 4224571
Indigenous women join forces to protest Bolsonaro
AP-APTN-0347: Indonesia Eid AP Clients Only 4224569
Muslims offer prayers for Eid in Indonesia capital
AP-APTN-0331: Saudi Arabia Hajj Kaaba AP Clients Only 4224568
Hajj pilgrims circle Kaaba at Islam's holiest site
AP-APTN-0328: Puerto Rico Activists AP Clients Only 4224567
Puerto Rico activists keep protest movement alive
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.