ETV Bharat / bharat

పలు అభివృద్ధి పనులకు నేడు మోదీ శ్రీకారం - ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మంగళవారం ఈడీఎఫ్​సీలోని నూతన భూపుర్​-నూతన ఖుర్జ భాగాన్ని ప్రారంభించనున్నారు. ఈ 351 కీలోమీటర్ల పొడవు గల కారిడర్​ను వర్చువల్​ విధానంలో మోదీ ఆవిష్కరిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

PM to inaugurate 'New Bhaupur-New Khurja section of eastern freight corridor on Dec 29
ఈడీఎఫ్​సీ కారిడర్ భాగాన్ని​ ప్రారంభించనున్న మోదీ
author img

By

Published : Dec 29, 2020, 5:12 AM IST

Updated : Dec 29, 2020, 8:02 AM IST

ఈడీఎఫ్​సీ(ఈస్టర్న్​ డెడికేటెడ్​ ఫ్రైట్​ కారిడర్​)లోని నూతన భూపుర్​- నూతన ఖుర్జ భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్​ విధానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇదే కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని ఈడీఎఫ్​సీకి చెందిన కార్యకలాపాల నియంత్రణ కేంద్రాన్ని(ఓసీసీ) కూడా ప్రధాని ప్రారంభిస్తారని స్పష్టం చేసింది. ఈ వేడుకలో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, గవర్నర్​ ఆనందిబెన్​ తదితరులు పాల్గొంటారని పేర్కొంది.

పంజాబ్​లోని లుథియానా నుంచి హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, ఝార్ఖండ్​ మీదుగా బంగాల్​లోని ధన్​కుని వరకు ఈ 1,856కిలో మీటర్ల ఈడీఎఫ్​సీని నిర్మిస్తున్నారు. అందులో నూతన భూపుర్​-నూతన ఖర్జు విభాగం పొడవు 351 కిలోమీటర్లు. దీని వ్యయం రూ, 5,750కోట్లు. ఇది అందుబాటులోకి వస్తే.. స్థానిక పరిశ్రమలకు మేలు జరగనుంది. ఇది రైల్వేకు బాగా ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి:- 'కిసాన్ రైలు​తో రైతు సాధికారత'

Last Updated : Dec 29, 2020, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.