కర్తార్‌పుర్ ఆధ్యాత్మిక నడవా రేపు ప్రారంభం కానుంది. భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారా ను పాకిస్థాన్ పంజాబ్‌లోని దర్బార్ సాహిబ్ పుణ్యక్షేత్రాన్ని కలుపుతూ నిర్మాణమైన ఈ నడవాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. పంజాబ్ డేరా బాబా నానక్ వద్ద ఆర్ట్ పాసింజర్ టెర్మినల్ భవనాన్ని (పీటీబీ) మోదీ ప్రారంభిస్తారు.
ప్రారంభోత్సవానికి ముందు సుల్తాన్‌పుర్ లోధిలోని బేర్ సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ప్రధాని. ప్రారంభోత్సవం అనంతరం డేరా బాబా నానక్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు.
2018 నవంబర్ 22న గురు నానక్ 550వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం.. తీర్మానాన్ని ఆమోదించింది. అదే సమయంలో కర్తార్‌పుర్ నడవా నిర్మాణానికి తుది నిర్ణయం తీసుకుంది.
అత్యాధునిక భవనం..
15 ఎకరాల భూమిలో పర్యటకుల కోసం అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. విమానాశ్రయానికి సమానమైన ఏసీ భవనంలో 5 వేలమంది యాత్రికులకు సరిపోయే విధంగా 50 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటుచేశారు.
ఇదీ చూడండి: గాంధీలకు ఎస్పీజీ భద్రత కట్.. ఇక నుంచి జెడ్ ప్లస్‌లోనే