ETV Bharat / bharat

ఏడు రాష్ట్రాల సీఎంలతో నేడు  ప్రధాని మోదీ భేటీ

author img

By

Published : Sep 23, 2020, 5:01 AM IST

Updated : Sep 23, 2020, 6:13 AM IST

కరోనా విస్తృతి అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం భేటీ కానున్నారు. ఈ రాష్ట్రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తరిస్తున్న తీరు, మహమ్మారిని అరికట్టడానికి చేపడుతున్న చర్యలు.. తదితర అంశాలపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు.

PM
ప్రధాని మోదీ

కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు. దృశ్యమాధ్యమం ద్వారా జరగనున్న ఈ భేటీలో ఏడు రాష్ట్రాల సీఎంలతో పాటు ఆరోగ్య మంత్రులు కూడా పాల్గొననున్నారు.

ఈ రాష్ట్రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తరిస్తున్న తీరు, మహమ్మారిని అరికట్టడానికి చేపడుతున్న చర్యలు.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ ఏడు రాష్ట్రాల్లోనే 65.5 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్, తమిళనాడు, దిల్లీ, పంజాబ్​ ఉన్నాయి. క్రియాశీల కేసుల్లో 63శాతం, మరణాల సంఖ్యలో 77 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

ఇదీ చూడండి: 'ఆత్మనిర్భర్​ భారత్​ సృష్టించడంలో అదే కీలకం'

Last Updated : Sep 23, 2020, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.