తమిళ మహా కవి సుబ్రమణ్య భారతి 138వ జయంతి సందర్భంగా నిర్వహించే అంతర్జాతీయ భారతి ఉత్సవాలకు నేడు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం చెన్నైలోని వానవిల్ సాంస్కృతిక కేంద్రంలో జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకలను ఉద్దేశించి ప్రధాని సాయంత్రం 4.30కి మాట్లాడనున్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ఠ కృషి చేసిన వారికి భారతి అవార్డులు ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు కే.రవి పేర్కొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా వర్చువల్ విధానంలో జరుపుతున్నట్లు తెలిపారు.