మధ్యప్రదేశ్‌లోని 'పీఎం స్వనిధి' లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం సంభాషించారు. దృశ్యమాధ్యమం ద్వారా వీధి వ్యాపారులతో మాట్లాడిన మోదీ.. వ్యాపారాభివృద్ధికి పలు సూచనలు చేశారు.
ఇండోర్‌కు చెందిన వీధివ్యాపారులు ఛగన్‌లాల్, అతని భార్య సన్వీర్; గ్వాలియర్ నుంచి అర్చన శర్మ; రాయ్‌సెన్ నుంచి కూరగాయల వ్యాపారి దాల్చంద్కు మోదీతో మాట్లాడే అవకాశం లభించింది. ఇందులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.
వ్యాపారంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు మోదీ. ఇందులో భాగంగా తాగునీటి కోసం ప్లాస్టిక్ సీసాలకు బదులుగా కుండలు, కూజాలు వినియోగించాలని సూచించారు.
వ్యాపారాలపై ఆరా..
వీధి వ్యాపారుల కోసం తీసుకొచ్చిన స్వనిధిపై ఆరా తీశారు మోదీ. ఈ పథకం ద్వారా ఎలా లబ్ధిపొందారో అడిగారు. వాళ్ల వ్యాపారాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఛగన్లాల్ను ఉజ్వల పథకం ద్వారా ఎలా లబ్ధి పొందుతున్నారో తెలుసుకున్నారు. డిజిటల్ పేమెంట్ల ద్వారా వ్యాపారం సాగిస్తున్న దాల్చంద్ను అభినందించారు మోదీ.
ఇదీ చూడండి: వీధి వ్యాపారులకు అండగా పీఎం స్వనిధి