లోక్సభ కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం.
సాధారణంగా లోక్సభ కార్యకలాపాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగుతాయి.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 15 గంటలు కేటాయించారు. మంగళవారం కూడా ఇది కొనసాగుతుంది.
లోక్సభ వాయిదా పడే కొద్ది క్షణాల ముందు.. మంగళ, బుధవారాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని స్పీకర్ను కోరారు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. ధన్యవాద తీర్మానంలో అందరూ పాల్గొనేందుకే ఈ ప్రతిపాదన చేసినట్టు వెల్లడించారు. జోషి ప్రతిపాదనను స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు.
సాధారణంగా.. సాయంత్రం 4-5 గంటల మధ్య ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.