ETV Bharat / bharat

'దేశంలో కరోనా కట్టడికి ఈ 10 రాష్ట్రాలే కీలకం'

author img

By

Published : Aug 11, 2020, 11:47 AM IST

Updated : Aug 11, 2020, 2:53 PM IST

PM Narendra Modi
ప్రధాని మోదీ దృశ్యమాధ్యమ సమీక్ష

14:41 August 11

  • #WATCH We have seen that in some districts of UP, Haryana & Delhi, there was a phase when #COVID19 became a huge problem. Then we held a review meeting & a committee was formed under the chairmanship of Amit Shah and to a great extent, we achieved the results that we wanted: PM pic.twitter.com/bH4vBhUKGa

    — ANI (@ANI) August 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పది రాష్ట్రాల్లో కరోనాను నియంత్రించగలిగితే మహమ్మారిపై విజయం సాధించగలమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఈ పది రాష్ట్రాల్లోనే 80 శాతం క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.  

కరోనా కట్టడిపై 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమంలో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్,  పంజాబ్​, బంగాల్, గుజరాత్​ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.  

"దేశంలో రికవరీ రేటు పెరుగుదల ప్రభుత్వ కృషి ఫలిస్తుందని తెలియజేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జట్టుగా పనిచేయాలి. ఈ మహమ్మారిపై పోరులో కంటైన్మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్, నిఘాపై మనకు ఉన్న అనుభవం ప్రభావవంతమైన ఆయుధాలు.  

అంతేకాకుండా మరణాల రేటు తగ్గుముఖం పట్టడం సానుకూలాంశం. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో మరణాల రేటు చాలా తక్కువ."

- ప్రధాని నరేంద్రమోదీ

3 రోజుల్లో పరీక్షించాలి..

దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, హరియాణాలోని కొన్ని జిల్లాల్లో ఓ దశలో కరోనా చాలా పెద్ద సమస్యగా మారిందని ప్రధాని తెలిపారు. ఈ విషయంపై సమీక్ష నిర్వహించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, అనుకున్న ఫలితాలు వచ్చాయని చెప్పారు.  

"కరోనా బాధితుడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి 72 గంటలలోపు నిర్ధరణ అయినట్లయితే, అప్పుడు వ్యాప్తిని చాలా వరకు నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల సోకిన వ్యక్తితో సంబంధం ఉన్నవారిని 72 గంటలలోపు పరీక్షించడం చాలా ముఖ్యం" అని ప్రధాని వివరించారు. 

13:45 August 11

  • దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు పోరాటం చేస్తున్నాం: ప్రధాని
  • కరోనా వ్యతిరేక పోరాటంలో నియంత్రణే ఆయుధం: ప్రధాని
  • కరోనా నివారణకు కాంటాక్ట్-ట్రేసింగ్, నిఘా అత్యంత ప్రభావవంతమైన ఆయుధాలు: ప్రధాని
  • కరోనా పట్ల మరింత అప్రమత్తత అవసరం: ప్రధాని మోదీ
  • కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రతి రాష్ట్రం పాత్ర చాలా ముఖ్యం: ప్రధాని

11:29 August 11

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు. 

ప్రధానితో పాటు సమీక్షకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్, కిషన్‌రెడ్డి హాజరయ్యారు. 

తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్, మంత్రి ఈటల, ఉన్నతాధికారులు ఉన్నారు. 

Last Updated : Aug 11, 2020, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.