కరోనా సంక్షోభం, వరదలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బిహార్, అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మోదీ ఫోన్లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.