ETV Bharat / bharat

నేడు పీఎంఎంఎస్​వైను ఆవిష్కరించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం..'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' పథకాన్నిప్రారంభించనున్నారు. డిజిటల్ పద్ధతిలో బిహార్​లో జరగనున్న ఈ కార్యక్రమంలో రైతులకు నేరుగా బ్రీడ్ అభివృద్ధి మార్కెట్​ప్లేస్ సమాచారాన్ని అందించే ఈ-గోపాల యాప్​నూ ఆవిష్కరించనున్నారు.

PM Modi to launch PM Matsya Sampada Yojana
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ఆవిష్కరణ
author img

By

Published : Sep 10, 2020, 5:56 AM IST

Updated : Sep 10, 2020, 8:01 AM IST

మత్స్యరంగ అభివృద్ధికోసం ప్రకటించిన 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన​(పీఎంఎంఎస్​వై)'తో పాటు, రైతులకు ఉపయోగపడే.. ఈ-గోపాల యాప్​లను గురువారం ఆవిష్కరించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది.

పీఎంఎంఎస్​వై విశేషాలు..

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మత్స్య రంగం సుస్థిరాభివృద్ధి కోసం తీసుకొచ్చిందే పీఎంఎంఎస్​వై. ఆత్మ నిర్భర్ భారత్​లో భాగంగా ఐదేళ్లలో మత్స్య రంగానికి రూ.20,050కోట్ల పెట్టుబడి అంచనాతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్రం.

ఇందులో రూ.12,340 కోట్లను మెరైన్, ఇన్​ల్యాండ్ ఫిషరీ కార్యకలాపాల కోసం, రూ.7,710 కోట్లను మత్స్య రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రతిపాదించింది.

2024-25 నాటికి అదనంగా 70 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేయడం, వాటి ఎగుమతి ఆదాయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇదే సమయంలో పంటకోత అనంతరం 20-25 శాతంగా ఉన్న నష్టాలను 10 శాతానికి తగ్గించడం సహా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్య పరిశ్రమలో 55 లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించాలని కేంద్రం భావిస్తోంది.

ఈ-గోపాల యాప్​..

సమగ్ర బ్రీడ్ అభివృద్ధి మార్కెట్​ప్లేస్ సమాచారాన్ని నేరుగా రైతులకు అందించే ఈ-గోపాల యాప్​నూ ప్రధాని గురువారం ఆవిష్కరించనున్నారు.

ఆన్​లైన్​లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి, బిహార్ గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి:సౌదీ రాజుతో మోదీ సంభాషణ.. ఆ విషయంపైనే చర్చ​

Last Updated : Sep 10, 2020, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.