ETV Bharat / bharat

నేడు 'స్వచ్ఛ' అవార్డులు ప్రకటించనున్న ప్రధాని మోదీ - స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ఫలితాలు

'స్వచ్ఛ సర్వేక్షణ్​' కార్యక్రమంలో భాగంగా 2020కి గాను గురువారం పరిశుభ్రత అవార్డులను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో మొత్తం 129 అవార్డులను అగ్రశ్రేణి నగరాలు, రాష్ట్రాలకు అందజేయనున్నారు.

SWACHH SARVEKSHAN 2020
స్వచ్ఛ సర్వేక్షణ్-2020
author img

By

Published : Aug 20, 2020, 7:17 AM IST

స్వచ్ఛ సర్వేక్షణ్-2020 ఫలితాలను ప్రధాని నరేంద్రమోదీ గురువారం ప్రకటించనున్నారు. దేశవ్యాప్త వార్షిక పరిశుభ్రత సర్వే ఐదో ఎడిషన్​ ఫలితాలు ఇవి. దేశంలోని 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లోని 1.87 కోట్ల మంది పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో మొత్తం 129 అవార్డులను అగ్రశ్రేణి నగరాలు, రాష్ట్రాలకు అందజేయనున్నారు.

లబ్ధిదారులతో మోదీ భేటీ..

'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్' ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులు, సఫాయి కార్మికులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడ‌నున్నారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్- 2020 ఫలితాల డాష్​బోర్డును ఆవిష్కరించనున్నారు మోదీ.

పోటీతత్వం పెంచేందుకు..

స్వచ్ఛ సర్వేక్షణ్​ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశుభ్రత సర్వే. స్వచ్ఛ భారత్​ మిషన్​లో దేశ పౌరులను భాగస్వామ్యం చేసేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్రతలో నగరాలు, రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ చొరవ తీసుకున్నారు.

మొదటి ఎడిషన్​లో మైసూర్ నగరం ఈ అవార్డు పొందగా.. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.