ETV Bharat / bharat

భారత జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవాలి: ప్రధాని - PM Modi to address Mann Ki Baat

భారత జీవ వైవిధ్యాన్ని అద్వితీయ సంపదగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని, భద్రపరుచుకోవాలని మన్​కీ బాత్​ కార్యక్రమం ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.

Mann Ki Baat
భారత జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవాలి: ప్రధాని
author img

By

Published : Feb 23, 2020, 12:59 PM IST

Updated : Mar 2, 2020, 7:10 AM IST

జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశంలో ఉన్న జీవ వైవిధ్యం సర్వ మానవాళికి అమూల్యమైన సంపద వంటిదని ప్రధాని అన్నారు.

ఆకాశవాణి ద్వారా నెలనెలా నిర్వహించే మనసులో మాట కార్యక్రమంలో 62వసారి ప్రసంగించారు మోదీ.

భారత జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవాలి: ప్రధాని

"సంవత్సరం మొత్తం ఎన్నో వలస పక్షులకు భారత్​ ఒక నివాసం. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 రకాల పక్షులు ఇక్కడకు వస్తాయి. ఇటీవల గాంధీనగర్​లో సీఓపీ-13 సభ జరిగింది. ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. రానున్న మూడేళ్ల పాటు వలస పక్షులపై జరిగే సీఓపీ సభకు భారత్​ అధ్యక్షత వహించడం మనందరికీ గర్వకారణం. మన జీవవైవిధ్యం సర్వమానవాళికి ఓ అమూల్య సంపద. దాన్ని మనం భద్రపరుచుకోవాలి, సంరక్షించుకోవాలి, పెంపొందించుకోవాలి."

- మన్​కీ బాత్​లో ప్రధాని మోదీ

ఇటీవల దిల్లీలో హునార్‌ హాట్​ మేళాను తాను సందర్శించడాన్ని గుర్తు చేశారు ప్రధాని. దేశంలోని భిన్నత్వం అంతా అక్కడ కనిపించిందని అన్నారు.

Last Updated : Mar 2, 2020, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.