ETV Bharat / bharat

నూతన రాజ్యసభ ఎంపీలతో మోదీ సమావేశం

author img

By

Published : Jul 22, 2020, 8:31 PM IST

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన భాజపా ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వారితో పలు విషయాలపై చర్చించారు. అనంతరం నూతన ఎంపీల అభిప్రాయాలను తెలుసుకున్నారు మోదీ.

PM Modi interacts with newly-elected BJP Rajya Sabha MPs
నూతన రాజ్యసభ ఎంపీలతో ముచ్చటించిన మోదీ

కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన భాజపా ఎంపీలతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజా సేవ పట్ల వారికున్న అభిప్రాయాలను తెలుసుకున్నారు. నూతన ఎంపీలతో ముచ్చటించడం అద్భుతంగా ఉందన్నారు ప్రధాని.

"రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన భాజపా ఎంపీలతో మంచి సంభాషణ జరిగింది. ప్రజాసేవ పట్ల వారి అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకోవడం అద్భుతంగా ఉంది. ఈ ఎంపీల బృందం పార్లమెంటరీ వ్యవహారాల్లో సమర్థంగా పని చేస్తుంది."

-ప్రధాని నరేంద్ర మోదీ

పెద్దలసభకు కొత్తగా ఎన్నికైన 45మందితో ప్రమాణ స్వీకారం చేయించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రమాణ స్వీకారం చేసిన 45మందిలో 36మంది తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన వారే కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో సభలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో గురువారం నుంచి పూర్తిస్థాయి లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.