ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. రెండు రోజలు పాటు అక్కడే ఉంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్, ఆ దేశ ప్రధాని ఫిలిప్‌తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని భారత సంతతి ప్రజలతో సమావేశమవుతారు.
1950, 1960 దశకాల్లో ఫ్రాన్స్‌లో జరిగిన రెండు ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు స్మారకాన్ని అంకితం చేయనున్నారు మోదీ.
ఈ నెల 26 వరకు సాగే ఈ పర్యటనలో తొలుత ఫ్రాన్స్.. తర్వాత యూఏఈ, బహ్రెయిన్‌లో పర్యటిస్తారు మోదీ. ఈ పర్యటనలతో ఆయా దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పర్యటనకు వెళ్లే ముందు మోదీ చెప్పారు.
ఈనెల 23న యూఏఈ వెళ్తారు మోదీ. అబుదబీ యువరాజు షేక్ మొహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన 'ఆర్డర్ ఆఫ్ జాయేద్' పురస్కారాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత 24నే బహ్రెయిన్ చేరుకుంటారు. ఆ దేశాధినేతలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఈ తర్వాత 25న మళ్లీ ఫ్రాన్స్ చేరుకుంటారు. రెండు రోజులు అక్కడే ఉండి జీ-7 సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలతో మోదీ సంప్రదింపులు జరుపుతారు.
ఇదీ చూడండి: ఇంద్రాణీ వాంగ్మూలంతోనే చిదంబరానికి చిక్కులు