ETV Bharat / bharat

సరిహద్దులో ఉద్రిక్తతపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం - చైనా ఇండియా సరిహద్దులు

చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు, త్రివిధ దళాల ప్రధానాధికారి సహా త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

PM MEETING WITH SECURITY OFFICIALS
సరిహద్దు ఉద్రిక్తతపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
author img

By

Published : May 26, 2020, 11:06 PM IST

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, త్రివిధ దళాల ప్రధానాధికారి బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. లద్ధాఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలతోపాటు లద్ధాఖ్ సమీపంలో చైనా ఎయిర్ బేస్ విస్తరిస్తున్న దృశ్యాలు ఉపగ్రహ చిత్రాల ద్వారా బయటపడ్డాయి. ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు ప్రధాని మోదీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లాతో విడిగా సమావేశమై.. చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రివిధ దళాల ప్రధానాధికారి, ఇతర అధిపతులతో సరిహద్దు భద్రతపై సుదీర్ఘ సమీక్ష సాగింది. అనంతరం ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. ఈనెల 5 న పాంగాంగ్‌ ప్రాంతంలో ఇరుదేశాల సైనికులు తీవ్రస్థాయిలో ఘర్షణపడ్డారు. ఈ ఘటనలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాయాలపాలయ్యారు. నాటి నుంచి తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 9 న ఉత్తర సిక్కింలోనూ అలాంటి పరిస్థితుల తలెత్తాయి. తమ గస్తీకి చైనా బలగాలు పదేపదే అడ్డొస్తున్నాయని గతవారం సైన్యం ప్రకటించింది.

భద్రతా దళాల మోహరింపుపై ఆరా..

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు దీటుగా బదులిచ్చేందుకు రెండు వారాలుగా జరుగుతున్న మంతనాల్లో భాగంగా.. ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద తాజా పరిస్థితిని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవణె, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌కు వివరించినట్లు సమాచారం. రెండురోజులక్రితం ఆయన లెహ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. భద్రతాదళాల మోహరింపుపై ఆరాతీసిన రాజ్‌నాథ్‌.. చైనా దురాక్రమణకు సంబంధించి సైనిక ప్రతిస్పందనకు పూర్తి మద్దతు ప్రకటించినట్లు సమాచారం.

నిరాకరిస్తున్న చైనా సైన్యాలు..

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు ఈనెల 5 న జరిగిన చర్చలు విఫలమయ్యాక ఇరుదేశాల సైన్యాలు 6 విడతలుగా సమావేశమయ్యాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భారత భూభాగంలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఆపాలని చైనా షరతు విధించింది. అయితే అది ఆమోదయోగ్యం కాదని భారత్‌ స్పష్టంచేసింది. మరోవైపు భారత్‌ మాత్రం యథాతథ స్థితి కొనసాగిద్దామని కోరగా... భారత భూభాగం నుంచి వెనక్కెళ్లేందుకు చైనా సైన్యాలు నిరాకరిస్తున్నాయి. భారత్‌ తన వైపున సరిహద్దుల్లో దర్బక్‌-స్యోక్‌ మధ్య 255 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణం చేపట్టడమే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల కారకోరం వద్ద ముగిసే దేసంగ్‌, గల్వాన్‌ వ్యాలీ వరకూ వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. ఫలితంగా భారత సైనిక దళాలకు గస్తీ నిర్వహించటం సులభతరం కావటం, పెట్రోలింగ్‌ నిడివి పెరగటం చైనాకు కంటగింపుగా మారింది.

ఇదీ చదవండి: ఒక్కరోజులో 35వేలమంది ఆహారాన్ని ఆరగిస్తున్న మిడతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.