కేంద్రంలో మహాకూటమి ప్రభుత్వం వస్తే దేశ భద్రత క్షీణిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి ఓటు వేయొద్దని ప్రజలను అభ్యర్థించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ. పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపి నేటితో 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సేవలను కీర్తించారు.
"21 ఏళ్ల క్రితం ఇదే రోజు భారత్ పరమాణు పరీక్షలు జరిపింది. ఆపరేషన్ శక్తిని విజయవంతంగా పూర్తి చేశాం. 1998లో జరిగిన ఈ ఘటన బలమైన ప్రభుత్వం దేశ రక్షణకు ఎలా కృషి చేస్తుందో రుజువు చేసింది. ఈ సామర్థ్యం భారత్‌కు ఎప్పటినుంచే ఉన్నా ప్రయోగించలేదు. భాజపా కన్నా ముందు ఉన్న ప్రభుత్వంలో అంత దమ్ము లేదు. ఆ విధంగా నిర్ణయం తీసుకోలేకపోయింది. మళ్లీ అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: 'మోదీ సిద్ధాంతం విభజించి.. పాలించడం'