తాను కాంగ్రెస్ కార్యకర్తనేనని.. పార్టీ హైకమాండ్ ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సచిన్ పైలట్ వెల్లడించారు. అయితే తాను ఎలాంటి పదవులకు డిమాండ్ చేయలేదని స్పష్టం చేసిన పైలట్.. ప్రతీకార రాజకీయాలకు చోటుండకూడదని అభిప్రాయపడ్డారు.
"నాపై వాడిన పదజాలం ఎంతో బాధ కలిగించింది. అలాంటి మాటలను మర్చిపోవడం మంచిదని అనుకుంటున్నా. రాజకీయాల్లో సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలి. కానీ ప్రతీకార రాజకీయాలకు చోటుండకూడదు. సమస్యలు, విధానాల ఆధారంగా పని జరగాలి."
-- సచిన్ పైలట్, కాంగ్రెస్ నేత.
మరోవైపు కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగురువేసిన దాదాపు నెలరోజుల అనంతరం.. మంగళవారం జైపుర్‌లో అడుగుపెట్టారు పైలట్. ఆయనకు మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది.
-
#WATCH Jaipur: Supporters of Congress leader Sachin Pilot raise slogans & welcome him, as he returns to #Rajasthan
— ANI (@ANI) August 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
He met Rahul Gandhi & Priyanka Gandhi Vadra in Delhi yesterday. A three-member committee formed for redressal of the issues raised by him and some MLAs of the party pic.twitter.com/SQVGY49SZB
">#WATCH Jaipur: Supporters of Congress leader Sachin Pilot raise slogans & welcome him, as he returns to #Rajasthan
— ANI (@ANI) August 11, 2020
He met Rahul Gandhi & Priyanka Gandhi Vadra in Delhi yesterday. A three-member committee formed for redressal of the issues raised by him and some MLAs of the party pic.twitter.com/SQVGY49SZB#WATCH Jaipur: Supporters of Congress leader Sachin Pilot raise slogans & welcome him, as he returns to #Rajasthan
— ANI (@ANI) August 11, 2020
He met Rahul Gandhi & Priyanka Gandhi Vadra in Delhi yesterday. A three-member committee formed for redressal of the issues raised by him and some MLAs of the party pic.twitter.com/SQVGY49SZB
ఇదీ జరిగింది...
రాజస్థాన్ రాజకీయాలపై అసతృంప్తితో గత నెల రెబల్‌గా మారారు సచిన్ పైలట్. తన బృందంతో కలిసి రాజస్థాన్‌ను వీడారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై అనిశ్చితి నెలకొంది. అయితే పైలట్ అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. తిరిగి పార్టీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు.
ఇవీ చూడండి:-