వరుసగా రెండోసారి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పెమా ఖండూ. గవర్నర్ బి.డి. మిశ్రా ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఈటానగర్‌లోని దోర్జీ ఖండూ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా కార్యక్రమం జరిగింది.
ముఖ్యమంత్రితో పాటు మరో 11 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 60 సీట్లున్న అరుణాచల్ శాసనసభలో భాజపా 41 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.
అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, నాగాలాండ్ సీఎం నెయిఫియూ రియో, మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్‌లు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
ఇదీ చూడండి: పాంచ్ పటాకా సీఎం 'నవీన్ పట్నాయక్'