పార్లమెంట్లో, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు. చర్చల్లో అసభ్యకరమైన భాష మాట్లాడితే.. ఇతర సభ్యుల మనోభావాలను దెబ్బతింటాయని అభిప్రాయపడ్డారు.
80వ అఖిల భారత స్పీకర్ల సదస్సును గుజరాత్ కేవడియాలో ప్రారంభించిన అనంతరం.. ఆయన ప్రసంగించారు
" ప్రజాస్వామ్య విలువలకు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉంటారని ప్రజలు ఆశిస్తారు. ప్రజల ఆశలను సాకారం చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన కర్తవ్యం. తాము ఎన్నుకున్న నేత.. సభలో అసభ్యకరంగా మాట్లాడితే ప్రజలు అసహనానికి లోనవుతారు. "
-- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
సభలో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగేలా సభాపతులు బాధ్యత వహించాలని రామ్నాథ్ కోవింద్ కోరారు. ప్రజాస్వామ్య విధానంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికీ ప్రధాన పాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇరు పక్షాల మధ్య సహకారం, అర్థవంతమైన ధోరణిలో ఆలోచనల మార్పిడి జరగాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:'అధికారంలోకి వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం!'