ETV Bharat / bharat

'హెల్మెట్ లేని ప్రయాణం- రాహుల్​, గడ్కరీకి ఫైన్!​'

మోటారు వాహనాల చట్టం కొత్త నిబంధనలు ఈనెల 1నే అమల్లోకి వచ్చాయి. ఉల్లంఘనలకు పాల్పడ్డ కొందరు వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు​ ఏకంగా రూ.59వేల వరకు జరిమానా వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్​లైన్​లో ఓ సరదా ఉద్యమం మొదలైంది.

'హెల్మెట్ లేని ప్రయాణం- రాహుల్​, గడ్కరీకి ఫైన్!​'
author img

By

Published : Sep 5, 2019, 11:14 AM IST

Updated : Sep 29, 2019, 12:30 PM IST

"నిబంధనలన్నీ సామాన్యులకేనా...? రాజకీయ నేతలకు ఉండవా...?"... తరచూ వినిపించే డైలాగ్ ఇది. ఈ ప్రశ్న మరోమారు గట్టిగా వినిపిస్తోంది. నెట్టింట ఓ ఉద్యమమే నడుస్తోంది.

ఆన్​లైన్​ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్​ ఒక్కటే... రాజకీయ నేతలకు ట్రాఫిక్​ చలానాలు ఇవ్వాలని. ముఖ్యంగా... కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై వారు గురిపెట్టారు. ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించిన ఆ ఇద్దరికీ జరిమానా విధించాలని డిమాండ్ చేస్తూ 'ఛేంజ్ డాట్ ఓఆర్​జీ'లో ఆన్​లైన్​ ఉద్యమం మొదలుపెట్టారు.

ఇదీ విషయం...

మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల్ని ఇటీవలే కఠినతరం చేసింది కేంద్రం. ఈనెల 1 నుంచి జరిమానాల బాదుడు మొదలైంది. హరియాణా గురుగ్రామ్​లో ఓ ట్రాక్టర్​ డ్రైవర్​కు రూ.59వేలు ఫైన్​ పడింది. భువనేశ్వర్​లో ఓ ఆటో డ్రైవర్​కు రూ.47,500 జరిమానా వేశారు అధికారులు. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి.

ఈ వార్తల నేపథ్యంలో కొన్ని పాత ఫొటోలను బయటకు తీశారు నెటిజన్లు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్​పుర్​లో హెల్మెట్​ లేకుండా స్కూటర్​ నడుపుతున్న ఫొటో వాటిలో ముఖ్యమైంది. మహారాష్ట్ర డీజీపీని ట్విట్టర్​లో ట్యాగ్​ చేస్తూ ఆ ఫొటో పోస్ట్ చేశారు కొందరు ఔత్సాహికులు. ఆయనకు ఫైన్​ వేయరా అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ 'ఛేంజ్ డాట్ ఓఆర్​జీ'లో పిటిషన్​ వేశారు. వందలాది మంది ఇప్పటికే ఆ పిటిషన్​కు మద్దతు తెలిపారు.

రాహుల్​ వంతు...

గడ్కరీ స్కూటర్​ ఫొటోతోపాటు మరో ఛాయాచిత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అది కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీది. ద్విచక్రవాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ కనిపించారాయన.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.