ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ పైలట్‌ను విధుల నుంచి తప్పించింది ఇండిగో సంస్థ. సుప్రియా ఉన్ని నాయర్ అనే ప్రయాణికురాలు సోమవారం రాత్రి తన 75 ఏళ్ల తల్లితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. తన తల్లి మధుమేహంతో బాధపడుతున్నారని, చక్రాల కుర్చీ కావాలని సిబ్బందిని కోరారు. అయితే... పైలట్ మాత్రం అనుచితంగా సమాధానం ఇచ్చినట్లు ఆరోపించారు సుప్రియ. ఎక్కువ మాట్లాడితే జైలులో పెడతానని బెదిరించినట్లు ట్వీట్ చేశారు.
ఈ విషయంపై విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు.
"పైలట్ అనుచితంగా ప్రవర్తించినట్లు సుప్రియా ఉన్ని నాయర్ ట్వీట్ చూడగానే నేను వెంటనే ఇండిగో సంస్థను సంప్రదించాను. ఆ పైలటన్ను విధుల నుంచి తొలగించినట్లు ఆ సంస్థ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. ఇందుకు సంబంధించి పూర్తి విచారణను జరుగుతోంది."
-హర్దీప్ సింగ్ పూరి, విమానయాన శాఖ మంత్రి
ఇదీ చూడండి:2020లో కొత్త ఉద్యోగాలు కష్టమే..!