పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(తొలి భాగం) రెండు రోజుల ముందే ముగిసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ముందుగా నిర్ణయించినట్లు ఫిబ్రవరి 15న కాకుండా.. 13వ తేదీనే ముగియవచ్చని తెలుస్తోంది.
ఈ అంశమై.. లోక్సభ బిజినెస్ అడ్వైజర్ కమిటీలో చర్చకు వచ్చింది. పలు పార్టీలకు చెందిన నేతలు.. ఫిబ్రవరి 13(శనివారం) వరకే జరపాలని అభిప్రాయపడ్డారు. తిరిగి మార్చి 8న సమావేశాలు ప్రారంభమవుతాయి.
వారాంతపు విరామాలు ఉంటాయ్..
గత వర్షాకాల సమావేశాల్లో శని, ఆదివారాల్లోనూ పార్లమెంటు ఉభయ సభలు కొనసాగాయి. ఈసారి మాత్రం ఎప్పటిలా వారాంతపు విరామాలుంటాయి. బడ్జెట్ సమావేశాలు మొత్తంగా ఏప్రిల్ 6న ముగుస్తాయి.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: ప్రతులు లేకుండానే బడ్జెట్ ప్రసంగం?