విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లు-2020కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లు లోక్సభలో సోమవారం నెగ్గగా.. తాజాగా రాజ్యసభలో పాసైంది.
ఈ బిల్లు ప్రకారం.. స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ)లు రిజిస్ట్రేషన్ సమయంలో ఆయా సంస్థల కార్యనిర్వాహకులు తమ ఆధార్ వివరాలను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు విదేశీ నిధులు అందడాన్ని నిరోధిస్తుంది.
ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో విపక్ష నేతలు రాజ్యసభ సమావేశాలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో విదేశీ విరాళాల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం లభిచింది.
ఇదీ చూడండి: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగింపు!