జాతీయ రూపకల్పన సంస్థల చట్టం సవరణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాజ్యసభలో నెగ్గిన ఈ బిల్లు నేడు లోక్‌సభలో మూజువాణి ఓటుతో పాసయింది.
ఈ బిల్లు ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, అసోం, హరియాణాలోని ఎన్‌ఐడీలకు జాతీయ ప్రాధాన్యం దక్కనుంది.
వీగిన సవరణలు..
ఎన్ఐడీ బిల్లుకు చాలామంది విపక్ష సభ్యులు సవరణలు ప్రతిపాదించారు. తమ తమ రాష్ట్రాల్లో ఎన్‌ఐడీలకు జాతీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఎన్ఐడీని తెలంగాణకు తరలించాలని తెరాస ఎంపీ బీబీ పాటిల్ ప్రతిపాదించారు. అయితే ఈ సవరణలన్నీ వీగిపోయాయి.
ట్రాన్స్జెండర్ల బిల్లుకూ..
ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది ఆగస్టు 5న లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లు.. నేడు రాజ్యసభలో నెగ్గింది.
ట్రాన్స్జెండర్లకు సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించింది కేంద్రం.
ఇదీ చూడండి: ట్రాన్స్జెండర్ల హక్కుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం