ETV Bharat / bharat

లోక్​సభ కార్యకలాపాలు రోజుకు నాలుగు గంటలే!

వచ్చే నెల 14 నుంచి జరగనున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఒకొక్క సభను రోజుకు నాలుగు గంటలు మించి నిర్వహించుకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా.. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ కార్యకలాపాలు జరపాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం.

Parliament monsoon sessions to be scheduled only 4 hours a day!
లోక్​సభ పనిచేసేది రోజుకు నాలుగు గంటలే!
author img

By

Published : Aug 29, 2020, 5:20 AM IST

కరోనా నేపథ్యంలో సెప్టెంబరు 14 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు భిన్నంగా జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు ఉభయ సభల్లోనూ జరపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ సభ్యులు కరోనా బారిన పడకుండా చూసేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకొక్క సభ(లోక్‌సభ, రాజ్యసభ) సమావేశం రోజుకు నాలుగు గంటలు మించి నిర్వహించకూడదని.. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది. వీటిపై వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాన్ని.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సేకరిస్తున్నారు.

అయితే ఇందుకు చాలా రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈసారి వర్షాకాల సమావేశాలు విరామం లేకుండా నిర్వహించాలని భావిస్తున్నట్లు జోషి చెప్పారు. "రోజుకు లోక్‌సభ నాలుగు గంటలు, రాజ్యసభ నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తాయి. వారాంతపు సెలవులను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. వాటిని కొనసాగిస్తే.. ఎంపీలు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కొవిడ్‌-19 ప్రమాదం ఎక్కువవుతుంది. సెలవులిస్తే.. అక్టోబర్‌ 1 తర్వాత కూడా పార్లమెంటును పొడిగించాల్సిన అవసరం ఏర్పడొచ్చు. ప్రస్తుత సమయంలో వ్యవధిని పెంచడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోంది" అని జోషి విలేకరులకు తెలిపారు.

ఈసారి పార్లమెంట్‌ సమావేశాల్లో చైనాతో సరిహద్దుల ఘర్షణను, కొవిడ్‌ మహమ్మారిపై భారత్‌ ప్రతిస్పందన అంశాలను ప్రధానంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు జోషి సంకేతాలిచ్చారు. వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం 20 బిల్లులు తేనుంది. ఇందులో మార్చి, ఆగస్టు మధ్యలో జారీ చేసిన 11 ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి.

రాజ్యసభ ఉదయం.. లోక్‌సభ సాయంత్రం

లోక్‌సభ, రాజ్యసభ పనివేళలపై కూడా కసరత్తు కొనసాగుతుంది. సమావేశాల సమయంలో రోజూ రాజ్యసభను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటలవరకు జరపాలని, లోక్‌సభను సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు జరపాలని భావిస్తున్నారు. తొలి రోజు మాత్రం సభా నిబంధనలు సవరించుకోవాల్సి ఉన్నందున లోక్‌సభను ఉదయం సమావేశపరిచే అవకాశం ఉంది.

ఎంపీలు పరీక్షలు చేయించుకోవాలి..

వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే పార్లమెంటు సభ్యులు .. 72 గంటల ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఎంపీలకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. సెప్టెంబర్‌ 14న మొదలై అక్టోబర్‌ 1తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన కొవిడ్‌-19 జాగ్రత్తలపై ఆయన భారత వైద్య పరిశోధన మండలి, ఎయిమ్స్‌, డీఆర్‌డీవో, దిల్లీ ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు.

ప్రశ్నోత్తరాల సమయం, శూన్యగంటపై కోత విధించకండి

వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, శూన్యగంటపై కోత విధించాలన్న ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల జాతీయ ప్రాధాన్యత అంశాలను లేవనెత్తే అవకాశం పార్లమెంటు సభ్యులు కోల్పోతారని ఆ పార్టీ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.