ETV Bharat / bharat

ఫిబ్రవరి 1 వరకు పార్లమెంట్​ ఉభయ సభలు వాయిదా - undefined

Parliament Budget Session live updates
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దం
author img

By

Published : Jan 29, 2021, 10:06 AM IST

Updated : Jan 29, 2021, 3:50 PM IST

15:39 January 29

పార్లమెంట్​ ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్​ ఉభయ సభలు ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడ్డాయి. అదే రోజు 2020-21 బడ్జెట్​ను పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. 

బడ్జెట్​ సమావేశాల సందర్భంగా ఉదయం.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని పలు విపక్ష పార్టీలు బహిష్కరించాయి. అనంతరం లోక్​సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఆ తర్వాత లోక్​సభను ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. 

రాజ్యసభ మధ్యాహ్నం ప్రారంభం కాగా.. ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. ఆ తర్వాత రాజ్యసభనూ వాయిదా వేశారు. 

13:24 January 29

ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటల వరకు లోక్​సభ వాయిదాపడింది.

12:26 January 29

  • Delhi: President Ram Nath Kovind leaves from the Parliament House after his Address at the joint session of the Parliament concludes. Vice President M Venkaiah Naidu and Prime Minister Narendra Modi also with him.#BudgetSession pic.twitter.com/m7CoX0hLjn

    — ANI (@ANI) January 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగం ముగిసింది. రాజ్యసభ తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం కానుంది. మధ్యాహ్నం సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

12:12 January 29

  • భారతదేశం ఎన్నో సంక్షోభాలను ఐక్యంగా ఎదుర్కొంది: ఉపరాష్ట్రపతి
  • కరోనా కష్టాలను దేశం సంఘటితంగా అధిగమించింది: ఉపరాష్ట్రపతి
  • ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ భారతదేశంలో జరుగుతోంది: ఉపరాష్ట్రపతి
  • భారతదేశం రెండు దేశీయ వ్యాక్సిన్లను రూపొందించింది: ఉపరాష్ట్రపతి

12:10 January 29

"అనేక నగరాల్లో మెట్రో రైలు సేవలను విస్తరిస్తున్నాం. దిల్లీలో చోదకరహిత రైలు సేవలు కూడా ప్రారంభించాం. ఈశాన్య రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర నది ఆధారంగా జల మార్గాలు అభివృద్ధి. బోడో ప్రాదేశిక బోర్డు ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలు. జమ్ముకశ్మీర్‌లో స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. జమ్ములో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ బెంచ్ ఏర్పాటు చేస్తాం. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వాలు ప్రయత్నించాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో కొత్త పార్లమెంట్ నిర్మాణం ఆనందదాయకం."

                           - రాష్ట్రపతి

11:41 January 29

"గ్రూప్-సి, డి పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగించడంతో ప్రతిభకు గుర్తింపు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ప్రజాస్వామ్యం బలోపేతం. దేశంలోకి విదేశీ పెట్టుబడులు గణమీయంగా పెరిగాయి."

                       - రాష్ట్రపతి

11:27 January 29

దేశంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే కార్యక్రమం వేగంగా సాగుతోంది. గణతంత్ర దినోత్సవం, జాతీయ పతాకానికి కొన్ని రోజులుగా అవమానాలు ఎదురవుతున్నాయి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం చట్టాలు, నిబంధనలు పాటించాలని కూడా చెబుతోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో ఎంఎస్ఎంఈల పాత్ర ఎంతో కీలకమైంది. రూ.20 వేల కోట్ల ప్రత్యేక నిధి, ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు చేయూత.

                            - రాష్ట్రపతి

11:23 January 29

"దేశ రైతుల ప్రయోజనానికి 3 సాగు చట్టాలను తీసుకొచ్చాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచుతోంది. రైతుల సంక్షేమం కోసమే నూతన సాగు చట్టాలను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 24 వేల ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఆయుష్మాన్ భారత్ సేవలు పొందొచ్చు. జన ఔషధి పరియోజన్ ద్వారా దేశవ్యాప్తంగా 7 వేల కేంద్రాల్లో పేదలకు చౌక ధరల్లో ఔషధాలు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాగు చట్టాలపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు వ్యయం."

                                           - రాష్ట్రపతి

11:19 January 29

  • దేశ పౌరులందరి జీవన స్థితిగతుల ఉన్నతికి ఆత్మనిర్భర్ భారత్‌తో బాటలు: రాష్ట్రపతి
  • ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది: రాష్ట్రపతి
  • రెండు వ్యాక్సిన్లను కూడా దేశంలోనే రూపొందించారు: రాష్ట్రపతి
  • సంక్షోభం సమయంలో పొరుగు దేశాలతో భారత్ కలసి సాగుతోంది: రాష్ట్రపతి
  • అనేక దేశాలకు లక్షల కొద్ది వ్యాక్సిన్ డోసులు పంపించాం: రాష్ట్రపతి
  • దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం: రాష్ట్రపతి
  • దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి: రాష్ట్రపతి
  • కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13 వేల కోట్లు బదిలీ చేశాం: రాష్ట్రపతి
  • చిన్న, సన్నకారు రైతులపై మరింత శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది: రాష్ట్రపతి

11:12 January 29

"స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్వయం సమృద్ధి భారతం ఒక స్వప్నం. కరోనా సంక్షోభం ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు అనేక దేశాలకు సరఫరా అవుతున్నాయి. ఈ సమావేశాలతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం."

                    - రాష్ట్రపతి

11:10 January 29

  • కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రభావితమయ్యారు
  • ఈ కరోనా సంక్షోభాన్ని భారతదేశం పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎదుర్కొంది
  • భారత్ అభివృద్ధి ప్రస్థానాన్ని ఏ సవాల్ కూడా అడ్డుకోలేదు
  • కరోనాపై భారతదేశం పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం
  • సమయానుకూల చర్యలతో కరోనాను సమర్థంగా కట్టడి చేయగలిగాం
  • ఈ పార్లమెంట్ సమావేశాలు భారతదేశానికి ఎంతో కీలకం
  • దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి

11:05 January 29

  • భారతదేశ చరిత్రలో ఇవాళ ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి
  • కరోనా ఎందరో మహనీయులను బలితీసుకుంది: రాష్ట్రపతి
  • ప్రణబ్‌ ముఖర్జీ వంటి నేతలు కరోనాతో మరణించారు: రాష్ట్రపతి
  • తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది: రాష్ట్రపతి
  • ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది: రాష్ట్రపతి
  • కరోనా మహమ్మారి ఎంతోమంది విలువైన ప్రాణాలను బలి తీసుకుంది
  • కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో భారత్‌ ప్రపంచం ముందు శక్తిమంతమైన దేశంగా నిలిచింది: రాష్ట్రపతి

11:00 January 29

  • పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
  • ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

10:55 January 29

  • ప్రతి అంశంపై చర్చిస్తాం.. పార్టీలు సహకరించాలి: ప్రధాని
  • ఈ దశాబ్దపు తొలి సెషన్‌ ఇవాళ ప్రారంభం కాబోతుంది: ప్రధాని
  • భారత భవిష్యత్‌లో ఈ దశాబ్దం చాలా ముఖ్యం: ప్రధాని
  • మన కలలు సాకారం చేసుకునేందుకు అత్యుత్తమ అవకాశం: ప్రధాని
  • దేశ ఉజ్వల భవిష్యత్‌కు ఈ దశాబ్దం చాలా ముఖ్యమైంది: ప్రధాని
  • వివరణాత్మక చర్చలు జరగాలని కోరుకుంటున్నా: ప్రధాని మోదీ

10:42 January 29

"ఈ దశాబ్దంలో ఇదే మొదటి సమావేశం. భారత భవిష్యత్తులో ఈ దశాబ్దం చాలా ముఖ్యం. మన కలలు సాకారం చేసుకునేందుకు ఇది ఒక అత్యుత్తమ అవకాశం. ప్రతి అంశాన్ని చర్చిస్తాం." 

                       - ప్రధాని మోదీ

10:40 January 29

బడ్జెట్​ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు. సమావేశాలకు అన్నీ పార్టీలు సహకరించాలని, ప్రతి విషయాన్ని చర్చిస్తామని మోదీ అన్నారు. 

10:36 January 29

  • కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు
  • ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి
  • పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించనున్న కేంద్రం
  • ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న బడ్జెట్‌ సమావేశాలు
  • ఫిబ్రవరి 15 వరకు తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు
  • మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు

10:22 January 29

బడ్జెట్​ సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్​ షా పార్లమెంటుకు చేరుకున్నారు. 

09:50 January 29

సాగు చట్టాల నిరసనల మధ్య బడ్జెట్ సమావేశాలు

దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న విపక్షాల డిమాండ్​తో.. సమావేశాలు సజావుగా సాగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే జారీ చేసిన వివిధ ఆర్డినెన్స్​లను చట్టాలుగా మార్చేందుకు.. సంబంధిత బిల్లులను ఇరు సభల ముందుకు తీసుకురానుంది కేంద్రం.

విపక్షాలు లేకుండానే..

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేసే ప్రసంగంతో బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనుంది ప్రభుత్వం. ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది.

అయితే, సాగుచట్టాలపై పోరాటం చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశాయి.

కాగా, బహిష్కరణపై పునరాలోచించుకోవాలని విపక్షాలను కేంద్రం కోరింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం మంచి పరిణామం కాదని పేర్కొంది. సమావేశాల తొలి భాగంలో బిల్లులు తీసుకురావట్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ధన్యవాదాల తీర్మానంపై చర్చ ఉంటుందని తెలిపింది. బడ్జెట్ సమావేశాల్లో 4 ఆర్డినెన్స్‌లను ఆమోదించేందుకు సిద్ధమైంది.

కొవిడ్ నిబంధనలు

గత పార్లమెంట్​ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ సమావేశాలు జరుగుతాయి.

కరోనా కారణంగా పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు రద్దు అయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్​లో జరిగిన సమావేశాల్లో.. శని, ఆదివారాల్లోనూ పార్లమెంట్​ కార్యకలాపాలు సాగించాయి. ఈసారి మాత్రం ఆయా రోజుల్లో సభలు ఉండవు.

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను రెండు భాగాలుగా విభజించింది కేంద్రం. శుక్రవారం మొదలయ్యే సమావేశాలు వచ్చే నెల 15తో ముగుస్తాయి. అనంతరం పార్లమెంట్​ మార్చి 8న తిరిగి సమావేశమవుతుంది.

కాగితరహితంగా

కరోనా నేపథ్యంలో కాగిత ప్రతులు లేకుండానే బడ్జెట్​ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందువల్ల.. సభ ముందుకు బడ్జెట్​ ప్రతులు, ఆర్థిక​ సర్వే డాక్యుమెంట్లు వచ్చిన అనంతరం.. వాటిని ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నారు.

'గేమ్​ఛేంజర్​'

కరోనా సంక్షోభం వేళ.. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్​ను గేమ్​ఛేంజర్​గా అభివర్ణించింది అధికార భాజపా. దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆ రోజున ఒక కొత్త శకం మొదలవుతుందని పేర్కొంది.

కాంగ్రెస్​ మాట...

2020-21 బడ్జెట్​లోని సవరించిన అంచనాలనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తిరిగి ప్రవేశపెడతారనే భయం తమలో ఉందని కాంగ్రెస్​ పేర్కొంది. ఏడేళ్ల భాజపా పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఆరోపించింది.

Last Updated : Jan 29, 2021, 3:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.