ETV Bharat / bharat

ఈ ఐదు చిట్కాలతో పబ్​జీ వ్యసనం నుంచి విముక్తి! - చైనా యాప్​లపై నిషేధం

దేశంలో పబ్​జీ గేమ్​పై నిషేధం విధించిన నేపథ్యంలో.. ఆ వ్యసనం నుంచి పిల్లలను బయట పడేసేందుకు మానసిక వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. పిల్లలకు వారి తల్లిదండ్రులు తోడ్పాటు అందించాల్సిన అవసరాన్ని వివరించారు.

PUBG addiction
పబ్​జీ
author img

By

Published : Sep 3, 2020, 2:17 PM IST

చైనాపై డిజిటల్ యుద్ధంలో భాగంగా ఆ దేశానికి చెందిన మరో 118 యాప్​లపై భారత్​ బుధవారం నిషేధం విధించింది. ఈ జాబితాలో ప్లేయర్స్​ అన్​కౌన్​ బ్యాటిల్​గ్రౌండ్​ (పబ్​జీ) గేమ్​ కూడా ఉంది.

ఈ మొబైల్​ గేమ్​ను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది డౌన్​లోడ్​ చేసుకోగా.. 5 కోట్ల మంది యాక్టివ్ గేమర్లు ఉన్నారు. ముఖ్యంగా భారత్​లో యువత దీనికి అధికంగా ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం బ్యాన్​ నేపథ్యంలో యువత, పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని బెంగళూరుకు చెందిన మానసిక వైద్య నిపుణులు జగదీశ్ సూచిస్తున్నారు.

ఇలా చేస్తే విముక్తి!

ఇప్పటివరకు రోజూ గంటల తరబడి పబ్​జీ ఆడిన వాళ్లు ఒక్కసారిగా మానేయడం కష్టమే అన్నారు జగదీశ్​. ఫలితంగా తలెత్తే మానసిక సమస్యలను ఎదుర్కొనేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి...

1. నిత్యం వ్యాయామం చేయడం.

2. పోషకాహారం తీసుకోవడం.

3. వేళకు నిద్రపోవడం.

4. సోషల్, కమ్యూనికేషన్​ స్కిల్స్ పెంచుకునేందుకు ప్రయత్నించడం.

5. కుటుంబంతో సరదాగా గడపడం.

ఇవన్నీ చేసినా పబ్​జీ నుంచి దృష్టి మరల్చుకోలేని వారు మానసిక నిపుణుల్ని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు జగదీశ్​.

డా. జగదీశ్​, మానసిక వైద్య నిపుణులు

"భారత్​లో చాలా మంది టీనేజర్లు ఈ ఆటకు బానిసగా ఉన్నారు. ఇది వారిలో మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది. ముఖ్యంగా గేమర్ల సామాజిక జీవనంపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యసనాన్ని పారదోలేందుకు పిల్లలకు వారి తల్లిదండ్రులు సాయం అందించాలి. ఈ సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలి". -జగదీశ్.

లాక్​డౌన్లో 9 వేల కోట్లు..

పబ్​జీ చైనాకు చెందిన యాప్​ అయినా.. దక్షిణ కొరియాకు చెందిన బ్లూహోల్ సంస్థ దీని సర్వర్లను నిర్వహిస్తోంది. పబ్​జీ మొబైల్​కు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అర్ధవార్షికంలో వచ్చిన ఆదాయం రూ.9,731 కోట్లు. ఇప్పటివరకు మొత్తం ఈ గేమ్​ ద్వారా రూ.22,457 కోట్లు ఆర్జించినట్లు అంచనా.

మొదటి నిషేధిత జాబితాలో పబ్​జీ లేకపోవటం వల్ల యూజర్లను మరింత పెంచుకునే లక్ష్యంతో కొత్త గేమింగ్​ను ప్రారంభించింది. పబ్​జీ మొబైల్ గ్లోబల్​ ఛాంపియన్​షిప్​తో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా గెలిచిన వారికి రూ.15 కోట్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొద్దిరోజులకే భారత్ యాప్​ను నిషేధిత జాబితాలోకి చేర్చింది.

ఇదీ చూడండి: పబ్​జీ.. ఇది ఆటా లేక యమ పాశమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.