ETV Bharat / bharat

దేశంలో ఒక్క రోజులోనే 1,750 కరోనా కేసులు

author img

By

Published : Apr 25, 2020, 5:16 AM IST

Updated : Apr 25, 2020, 6:59 AM IST

భారత్​లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే తొలిసారి అత్యధికంగా 1,750 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 23,500కి చేరువ కాగా.. మృతులసంఖ్య 723కి పెరిగింది. మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తోంది.

CORONAVIRUS
కరోనా

భారత్​లో కరోనా వేగం పుంజుకుంటోంది. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క రోజులోనే అత్యధికంగా 1,750 కొత్త కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 23,452కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్​ రాష్ట్రాల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే.. లాక్​డౌన్​ విధించకుండా ఉంటే కేసులు లక్ష దాటి ఉండేవని... ప్రస్తుతం వైరస్ అదుపులోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

'మహా' బీభత్సం

దేశంలో కరోనాకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో మరో 394 కేసులు గుర్తించారు అధికారులు. ఇందులో అత్యధికంగా ముంబయి నుంచే 357 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కేసులు 6,817కి చేరగా.. ఒక్క ముంబయి నగరంలోనే 4,447 మంది బాధితులు ఉన్నారు.

ముంబయిలో మరణించిన 11 మందితో కలిపి రాష్ట్రంలో నిన్న 18 మంది ఈ మహమ్మారికి బలైనట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 301కి చేరింది. 117 మంది కోలుకోగా రాష్ట్రంలో వైరస్ బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 957కి చేరింది.

రాజధానిలో కరోనా

దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 2,514కి పెరిగింది. కొత్తగా 138 కేసులు నమోదు కాగా.. ముగ్గురు ఈ వైరస్​కు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 53కి చేరుకుంది. ఇందులో సగానికి పైగా(29) మృతుల వయసు 60 ఏళ్ల పైనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. 14 మంది మృతులు 50-59 ఏళ్ల మధ్య ఉండగా.. మిగతా 10 మంది వయసు 50 ఏళ్ల లోపు ఉన్నట్లు స్పష్టం చేశారు.

3 వేలకు చేరువగా గుజరాత్​

గుజరాత్​లో కరోనా కేసులు 3 వేలకు చేరువయ్యాయి. 191 కొత్త కేసుల నమోదుతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 2,815కి పెరిగింది. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 17 ఏళ్ల యువతి సహా 90 ఏళ్ల వృద్ధురాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 127కి చేరినట్లు వెల్లడించారు. అహ్మదాబాద్​లో అత్యధికంగా 1,821 కేసులు నమోదు కాగా.. సురత్​ 462, వడోదరాలో 223 మందికి వైరస్ సోకింది.

యూపీ

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా మహమ్మారి తీవ్రంగా మారుతోంది. గత 24 గంటల్లో 111 కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసులు 1,621కి చేరుకున్నాయి. మేరఠ్​లో ఓ వ్యక్తి వైరస్​ ధాటికి ప్రాణాలు విడిచాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25కి చేరినట్లు అధికారులు తెలిపారు. 226 మంది బాధితులు వైరస్​ నుంచి సురక్షితంగా బయటపడ్డట్లు స్పష్టం చేశారు.

ఉత్తరాఖండ్​లో మరొకరికి పాజిటివ్

ఉత్తరాఖండ్​లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలింది. నైనిటాల్​ జిల్లాలో 40 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధరించారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 48కి చేరింది. ఇందులో 25 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Last Updated : Apr 25, 2020, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.