ETV Bharat / bharat

నా భార్యకు ఏదైనా మాట్లాడే హక్కుంది:సిద్ధు - amritsir

ఎంపీ టికెట్​ నిరాకరించినట్లు నవ్​జోత్​ కౌర్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​. కాంగ్రెస్​ అధిష్ఠానమే అమృత్​సర్​ ఎంపీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. తన భార్యకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదని కౌర్​కు మద్దతుగా నిలిచారు పంజాబ్​ మంత్రి నవజోత్​ సింగ్​ సిద్ధు.

నా భార్యకు ఏదైనా మాట్లాడే హక్కుంది:సిద్ధు
author img

By

Published : May 17, 2019, 9:40 AM IST

అమృత్​సర్​ ఎంపీ టికెట్ తనకివ్వకుండా​ నిరాకరించారని నవజోత్ కౌర్​ చేసిన ఆరోపణలను పంజాబ్​ సీఎం అమరిందర్​సింగ్​ ఖండించారు​. పార్టీ టికెట్​ కేటాయించినా కౌరే తిరస్కరించారని అన్నారు. అమృత్​సర్​ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుందని స్పష్టంచేశారు అమరిందర్​.

తన భార్యకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదని కౌర్​కు మద్దతుగా నిలిచారు పంజాబ్​ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్​ సింగ్​ సిద్ధు.

ఛండీగఢ్​ నుంచి పోటీ చేయాలని భావించిన కౌర్​కు పార్టీ ఆ స్థానాన్ని కేటాయించలేదు. కేంద్ర మాజీ మంత్రి పవన్​ కుమార్​ బన్సాల్​ను బరిలోకి దింపింది.

కాంగ్రెస్ ఓడితే రాజీనామా...

కౌర్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు అమరిందర్. లోక్​సభ ఎన్నికల్లో పంజాబ్​లో కాంగ్రెస్​ ఓడిపోతే రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్ కచ్చితంగా పంజాబ్​లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పంజాబ్​లోని 13 లోక్​సభ స్థానాలకు ఏడో విడతలో భాగంగా మే 19న ఎన్నికలు జరుగుతాయి.

ఇదీ చూడండి: 'ప్రధాని రేసులో ప్రాంతీయ నేతలుంటే సహకరిస్తాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.