ETV Bharat / bharat

రైతన్న ప్రయాణంలో భరోసా ఈ 'పల్లే సృజన' - పోగుల గణేశం

విశ్రాంత బ్రిగేడియర్​ పోగుల గణేశం.. పదవీ విరమణ తర్వాత గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో 'పల్లె సృజన'ను స్థాపించి.. వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను కాపాడేందుకు తన వంతు సహాయం చేస్తున్నారు. ఎన్నో అవిష్కరణలు చేసి అన్నదాతల ప్రయాణంలో అండగా నిలుస్తోంది ఈ పల్లె సృజన సంస్థ.

Pallesrjuna, initiated by former brigadier to help farmers
రైతన్న ప్రయాణంలో భరోసా ఈ 'పల్లే సృజన'
author img

By

Published : Dec 1, 2020, 12:17 PM IST

రైతన్న ప్రయాణంలో భరోసా ఈ 'పల్లే సృజన'

పల్లె సృజన! సుస్థిరత, సమానత్వం లక్ష్యాలుగా గ్రామీణ ఆవిష్కకర్తలకు బాసటగా నిలుస్తున్న సంస్థ. ఆర్థిక అభివృద్ధికి పునాది ఆవిష్కరణలు అన్న గాంధీజీ స్ఫూర్తితో అడుగులు వేస్తున్న వ్యవస్థ. పదవీ విరమణ తర్వాత గ్రామీణ భారతావనికి ఉపయోగపడాలన్న సంకల్పంతో పల్లె సృజన స్థాపించారు విశ్రాంత బ్రిగేడియర్ పోగుల గణేశం.

వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను కాపాడాలంటే..సేద్యం, అనుబంధ రంగాల్లో పెట్టుబడి ఖర్చు తగ్గాలి. సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు, పనిముట్లు అన్నదాతలకు చేరువ కావాలన్నది ఆయన సంకల్పం. అందుకోసం ఎన్నో గ్రామాలు తిరిగి, రైతులు, చేతివృత్తిదారులు, కార్మికులను కలిశారు. ఎందరో గ్రామీణ ఆవిష్కర్తలను పల్లెసృజన వేదిక ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు గణేశం.

5000మందికిపైగా వలంటీర్లు పల్లెసృజనతో చేతులు కలిపారు. పదిహేనేళ్లలో 2000 మంది గ్రామీణ ఆవిష్కర్తలను వెలుగులోకి తెచ్చారు. వారి చొరవతో 200కుపైగా ఆవిష్కరణలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 25... పేటెంట్ హక్కులు పొందాయి. కొన్నిరాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు, ప్రశంసలు దక్కించుకున్నాయి.

మహిపాల్ కల్టివేటర్, స్కూటర్ ఇంజన్‌తో రూపొందించిన 2 అడుగల వీడర్‌, కలుపు తీసే పరికరం, బహుళ ప్రయోజనాల విత్తనం గొర్రు, బూమ్ స్ప్రేయర్, అడవి పందులు పారదోలే అలారం, క్విక్ ప్లాంటర్, పేడ కుండీలు, దుంగలు, నులిపురుగుల నివారణకు మూలికల మందు, సైకిల్ నాగలి, కొబ్బరిచెట్లు ఎక్కే పరికరం, రూం ఎయిర్ క్లీనర్, జంబో కూలర్, పాలు పితికే యంత్రం, విద్యుత్‌రహిత వాటర్ కూలర్, పంక్చర్ కాని మోటార్ సైకిల్ ట్యూబు లాంటి ఎన్నో ఆవిష్కరణలు పల్లెసృజన గుర్తించింది.

అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆసు యంత్రం రూపకర్త చింతకింది మల్లేశం ప్రయాణంలో సైతం పల్లెసృజన ప్రోత్సాహం ఉంది. సేంద్రీయ పద్ధతిలో ద్రాక్ష, వరి, గోధుమసాగులో అద్భుతాలు సృష్టిస్తున్న చింతల వెంటకరెడ్డి, ప్రకృతి ప్రేమికుడు వనరామయ్యకు పద్మశ్రీ లభించడం వెనక పల్లె సృజన కృషి లేకపోలేదు. వారి ఆవిష్కరణలకు పేటెంట్‌ హక్కుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు గణేశం.

గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్స్ పేరిట ద్వైమాసిక పత్రిక వెలువరిస్తోంది పల్లెసృజన. తెలుగు రాష్ట్రాల్లో 35 సౌధయాత్రలు నిర్వహించారు గణేశం. 35వేల మంది రైతులతో మాట్లాడారు. మరుగున పడిపోయిన సంప్రదాయ పద్ధతులు, గ్రామీణ ఆవిష్కర్తలను గుర్తించారు. ఈ వేదిక ద్వారా పరిచయమైన ఆవిష్కరణల నుంచి లబ్ధి పొంది, 5 లక్షలకుపైగా రైతు కుటుంబాలు సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.

ఆవిష్కరణ ఒక్క మనిషి అవసరం తీర్చేది కాదు.. పదిమందికీ పనికొచ్చేది. గ్రామీణుల్లో సహజ సిద్ధంగానే సృజనాత్మక ఉంటుందని ప్రగాఢంగా విశ్వసించే ఓ వ్యక్తి.. వారిలోని ఆవిష్కకర్తలను వెలుగులోకి తెచ్చేందుకు ఓ వేదిక కల్పించారు. అదే పల్లెసృజన. భాగ్యనగరం వేదికగా పనిచేస్తూ, గ్రామీణ ఆవిష్కరలను ప్రపంచవ్యాప్తం చేస్తోంది. పల్లెసృజన వెనక ఉన్న వ్యక్తి పోగుల గణేశం.

ఇదీ చూడండి:- మినీ బ్రెజిల్‌గా పేరుగాంచిన 'అలఖ్‌పురా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.