పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నూతన ఏడాది తొలి రోజునే జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా క్రిష్ణ ఘాటి సెక్టార్లో కాల్పులు జరిపింది. రాత్రి 9 గంటల సమయంలో చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్స్‌తో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
పాక్ చేసిన ఈ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. రాత్రి 11 గంటల వరకు కాల్పులు కొనసాగినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎన్ఆర్సీ-ఎన్పీఆర్పై తొలగని సందేహాలు