ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై పాక్​వి కంటితుడుపు చర్యలు' - Hafiz Saeed

ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్​ సయీద్​పై 23 కేసులు నమోదు చేసినట్లు ​ప్రకటించిన పాకిస్థాన్​పై విమర్శలు చేసింది భారత్​. పాక్​పై ఒత్తిడి తెస్తోన్న అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చేందుకే కంటితుడుపు చర్యలు చేపట్టిందని పేర్కొంది.

'ఉగ్రవాదంపై పాక్​వి కంటితుడుపు చర్యలు'
author img

By

Published : Jul 4, 2019, 6:36 PM IST

ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్​ తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చేందుకేనని భారత్​ విమర్శించింది.

అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితో ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్​ సయీద్​తో సహా మరో 12 మంది సహచరులపై 23 కేసులు నమోదు చేసినట్లు పాక్​ ప్రకటించింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తీవ్రవాద సంస్థలపై దాయాది దేశం కంటితుడుపు చర్యలు చేపట్టిందని విమర్శించింది.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్​ కుమార్​

" ఉగ్రవాద సంస్థలపై పాక్​ చేపట్టిన కంటితుడుపు చర్యలకు మనం మోసపోకూడదు. తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవడంలో పాకిస్థాన్ చిత్తశుద్ధి... ఉగ్రమూకలపై వారు తీసుకునే తిరుగులేని పటిష్ఠ చర్యల ఆధారంగానే భారత్ లెక్కిస్తుంది. కానీ ఇలాంటి కంటితుడుపు చర్యలతో కాదు. అవి వారు కొన్నిసార్లు అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చేందుకు చేపడుతారు. తీవ్రవాదం లేని వాతావరణంలో సహజ సంబంధాలను కోరుకుంటున్నాం. "

- రవీష్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి.

ఇదీ చూడండి: పూరీ: వైభవంగా జగన్నాథుని రథయాత్ర

Digital Advisory
Thursday 4th July 2019
Clients, please note we will today have video from Frank Lampard's first press conference as head coach of Chelsea Football Club. Expect around 1500.
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.