జమ్ము కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ సియాల్కోట్కు చెందిన ఈ యువకుడి పేరు బష్రత్ అలీగా పోలీసులు గుర్తించారు.
"అలీ పాకిస్థాన్ నుంచి అక్రమంగా కశ్మీర్... ఆర్ఎస్ పుర సెక్టార్‌లోని చందుచౌక్ గ్రామంలో ప్రవేశించాడు. అతనిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అలీ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. "
- పోలీసు అధికారి
భారత్‌లోకి అనుమానితుడి అక్రమ చొరబాటుపై... పోలీసులు విచారణ చేపట్టారు.
ఆర్టికల్ 370 రద్దుతో
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి నిచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. దీనిని పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ దాడులు చేస్తోంది. జమ్ము కశ్మీర్లో అశాంతి రగిల్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అక్రమంగా భారత్‌లోకి చొరబాటుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతాదళాలు ముష్కరుల పన్నాగాలను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుమానితుడి రాక కొద్ది సేపటి వరకు ఆందోళన కలిగించింది.
ఇదీ చూడండి: పాక్ దుశ్చర్యకు 16 మూగజీవులు బలి