ETV Bharat / bharat

'పాక్‌ ప్రకటనతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి' - Bihar election campaign

బిహార్ ఎన్నికల ప్రచారంలో.. విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. పుల్వామా ఉగ్ర దాడిలో పాక్‌ ప్రమేయం ఉందని ఆ దేశ మంత్రి ప్రకటించడం వల్ల నిజానిజాలు బయటపడ్డాయని.. ఇది ప్రభుత్వ విమర్శకుల నోళ్లు మూయించిందని రాజ్​నాథ్​ పేర్కొన్నారు.

Pak minister s admission revealed truth of Pulwama attack, silenced govt critics: Rajnath Singh
'ప్రతిపక్షాలు పాకిస్థాన్​కు పరోక్షంగా మద్దతు'
author img

By

Published : Oct 31, 2020, 6:41 AM IST

పుల్వామా దాడిలో తమ ప్రమేయం ఉన్నట్లు పాక్​ అంగీకరించడం వల్ల ఎన్​డీఏ ప్రభుత్వ విమర్శకుల నోటికి తాళం పడిందని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. ప్రతిపక్షాలు పరోక్షంగా పాకిస్థాన్​కు మద్దతుగా నిలుస్తున్నాయని విమర్శించారు. బిహార్​ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ మేరకు విపక్షాలపై ధ్వజమెత్తారు రాజ్​నాథ్​.

"దేశ భద్రత కోసం పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్​ సహా ఇతర ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్థాన్‌ను రెండుగా విభజించినప్పుడు.. ఆమెను పార్లమెంటులో భాజపా సీనియర్ నేత అటల్​ బిహారీ వాజ్‌పేయి ప్రశంసించారు. కానీ ప్రభుత్వం సాధించిన విజయాలపై సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తడమే ఇప్పుడు కాంగ్రెస్​ పనిగా పెట్టుకుంది." - రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి.

దేశ ప్రాదేశిక సమగ్రత సమస్యపై కలిసి పనిచేయాలని హితవు పలికారు రాజ్​నాథ్​.

ఇదీ చూడండి: మోదీ గుజరాత్​ టూర్​.. గాంధీనగర్​ టూ ఐక్యతా విగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.