నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పూంచ్ జిల్లా గుల్పుర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణకు పాల్పడింది పొరుగుదేశం. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.
ఎల్ఓసీ వెంబడి ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో పాక్ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతదేహాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.