నియంత్రణ రేఖ సమీపంలోని జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలో.. పాకిస్థాన్ ఆదివారం కాల్పులు జరిపింది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
" తెల్లవారుజామున 3.20 గంటలకు పాకిస్థాన్ ఆయుధాలు, మోర్టార్లు ఉపయోగించి కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ ప్రాంతంలోని మాన్కోటే సెక్టార్లో పాక్ ఈ దుర్నీతికి పాల్పడింది. భారత దళాలు దీటుగా స్పందించాయి".
--కల్నల్ దేవేంద్ర ఆనంద్, రక్షణ శాఖ ప్రతినిధి
ఈ ఏడాదిలో !
1999లో భారత్-పాక్ మధ్య జరిగిన సరిహద్దుల్లో కాల్పుల నియంత్రణ ఒప్పందానికి.. దాయాది దేశం తూట్లు పొడుస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్థాన్ దుందుడుకు చర్యలు మరింత పెచ్చరిల్లుతున్నాయి.
ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన 3,190 పాక్ కాల్పుల చర్యల్లో 24 మంది పౌరులు మృతి చెందగా.. దాదాపు 100 మంది గాయాలపాలయ్యారు.
పంటలు నాశనం
పాక్ దుస్సాహస కాల్పుల చర్యకు నియంత్రణ రేఖ సమీపంలో నివసించే వేల మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మేరకు పంటలు కూడా నాశనమయ్యాయి.