ETV Bharat / bharat

చైనా-పాకిస్థాన్ మరో కుట్ర- పీఓకేలో క్షిపణి స్థావరాలు - Pak, China setting up new missile sites

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లక్ష్యంగా పాకిస్థాన్-చైనా కలిసి కుట్రలకు పదునుపెట్టాయి. సైనిక సదుపాయాలను పెంచుకోవడంలో భాగంగా పీఓకేలో క్షిపణి స్థావరాలు అభివృద్ధి చేస్తున్నాయి. మౌలిక సదుపాయాలనూ నిర్మిస్తూ.. అక్కడి నుంచే భారత్​వైపు నిఘా పెడుతున్నాయి.

Pak, China building new missile sites along western border
చైనా-పాకిస్థాన్ కుట్ర- పీఓకేలో క్షిపణి స్థావరాలు
author img

By

Published : Oct 7, 2020, 10:10 AM IST

చైనా సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లో క్షిపణి స్థావరాలను ఏర్పాటు చేస్తోంది పాకిస్థాన్. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగలిగే క్షిపణుల కోసం వివాదాస్పద ప్రాంతంలో ఈ స్థావరాలను అభివృద్ధి చేస్తోంది.

భారత సరిహద్దులో చైనా-పాకిస్థాన్ కలిసి అదనపు సైనిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. అక్కడి నుంచి భారత్​వైపు నిఘా పెడుతున్నట్లు వెల్లడించారు. పీఓకే లసాదాన్నా ధోక్​ సమీపంలోని పౌలి పీర్​ ప్రాంతంలో క్షిపణి స్థావరం కోసం నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపారు.

"పీఓకేలోని జురా, దియోలియాన్ ఫార్వర్డ్​ ప్రాంతాల్లో పాక్ సైన్యంతో కలిసి చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) నిఘా కార్యకలాపాలలో పాల్గొంది. 'ఫోర్స్ కమాండర్ నార్తర్న్ ఏరియా'(పాక్ డివిజన్ స్థాయి సైన్యం) ఆధ్వర్యంలో పాకిస్థాన్ సైన్యంతో కలిసి చైనా దళాలు కనిపించాయి.

దాదాపు 120 మంది పాకిస్థాన్ సైనికులు, 25-40 మంది పౌరులు నిర్మాణ(క్షిపణి స్థావరం) స్థలం వద్ద కనిపించారు. దీని కంట్రోల్ రూం వ్యవస్థ పీఓకే ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. పది మంది పీఎల్​ఏ సైనికులు, ముగ్గురు అధికారులను కంట్రోల్ రూంలో నియమిస్తారు."

-అధికారులు

హట్టియాన్ బాలా జిల్లాలోని చినార్, చకోఠీ గ్రామాల్లోనూ ఇదే తరహా నిర్మాణాలు చేపట్టడాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జగ్లోట్ ప్రాంతం నుంచి గౌరీ కోట్ వరకు చైనా ఇంజినీర్లు రహదారిని నిర్మిస్తున్నారని, ఈ రహదారిని గౌల్టరీ వరకు విస్తరించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. జగ్లోట్​లోని సాధారణ ప్రదేశాల్లోనూ పీఎల్ఏ సైన్యం.. పాక్ దళాలతో కలిసి కనిపించాయని వెల్లడించారు.

జట్టుగా వచ్చినా...

ఇటీవలి కాలంలో పాకిస్థాన్-చైనా ద్వైపాక్షిక విన్యాసాలు పెరిగిపోయాయని భారత వాయు సేన అధిపతి ఎయిర్​చీఫ్ మార్షర్ ఆర్​కేఎస్ భదౌరియా సైతం పేర్కొన్నారు. వీరి కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు సోమవారం వార్షిక మీడియా సమవేశంలో భాగంగా తెలిపారు. అయితే ఇరుదేశాల నుంచి 'సమష్టి ముప్పు' ఉందని చెప్పలేమన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తినా దీటుగా తిప్పికొడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- 'రెండు దేశాలతో ఒకేసారి యుద్ధమైనా మేం సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.