జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్థాన్. తాజాగా రాజౌరీ జిల్లాలో మోర్టార్ షెల్స్‌తో దాడికి దిగింది. పాక్ దుశ్చర్యకు భారత్ దీటుగా బదులిచ్చింది.
"రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్లో సాయంత్రం 4.45 గంటలకు పాక్ కాల్పులకు పాల్పడింది. చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్స్‌తో దాడికి దిగింది. ఇందుకు భారత ఆర్మీ బదులిచ్చింది."
-రక్షణ శాఖ ప్రతినిధి.
పాక్ శుక్రవారం జరిపిన కాలుల్లో జేసీఓ నాయబ్ సుబేదార్ రవీందర్ మృతిచెందారని రక్షణ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:2020లో 5,100సార్లు పాక్ కాల్పులు
ఆయుధాలు స్వాధీనం..
శనివారం.. జమ్ముకశ్మీర్ కుల్గాంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భాగంగా ఓ ఉగ్రవాదికి సహాయం చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చైనీస్ గ్రెనేడ్, పిస్టోల్ మొదలైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి