ETV Bharat / bharat

పాక్‌ నుంచి భారత్‌ వచ్చి.. బంగ్లాకు ముక్తినిచ్చి! - పాక్​ ఆర్మీలో బంగ్లాదేశ్​ వ్యక్తి రిటైర్డ్‌ కర్నల్​‌ ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్‌

పాకిస్థాన్​ నుంచి తూర్పు పాకిస్థాన్‌(ఇప్పటి బంగ్లాదేశ్)కు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించారు రిటైర్డ్‌ కర్నల్​‌ ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్‌. బంగ్లా ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషికి గానూ.. ఇటీవలే ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కర్నల్‌ ఖాజీ జహీర్‌ గురించి తెలుసుకుందాం..

Quazi Sazzad Ali Zahir
పాక్‌ నుంచి భారత్‌ వచ్చి.. బంగ్లాకు ముక్తినిచ్చి!
author img

By

Published : Jan 31, 2021, 10:36 AM IST

జేబులో ఇరవై రూపాయలు.. ఒంటిపై ప్యాంటు, చొక్కా.. దేశం నుంచి పారిపోతున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నవి ఇవే. దేశ రక్షణ కోసం పాక్‌ ఆర్మీలో చేరిన ఆయన.. అదే సైనికులు తూర్పు పాకిస్థాన్‌(ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజలపై పాల్పడుతున్న దురాగతాలను చూస్తూ ఉండలేకపోయారు. అందుకే యుద్ధ రహస్యాలతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు పారిపోయారు. ఆయనే.. రిటైర్డ్​ కర్నల్​ ఖాజీ సజ్జద్​ అలీ జహీర్​.

తూర్పు పాకిస్థాన్‌ (ఇప్పుడు బంగ్లాదేశ్‌)లోని కొమిల్లా జిల్లా చౌసాయి గ్రామంలో కర్నల్‌ ఖాజీ జహీర్‌ జన్మించారు. 18ఏళ్ల వయసులో 1969లో దేశ సైన్యంలో చేరారు. 1971లో కాకుల్‌ మిలిటరీ అకాడమీలో సీనియర్‌ కాడెట్‌గా శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాదిలో పాక్‌ ఆర్మీ ఆర్టిల్లరీ కార్ప్స్‌లో చేరారు. అదే సమయంలో తూర్పు పాకిస్థాన్‌లో ప్రత్యేక దేశం కోసం పోరాటం జరుగుతోంది.

సైన్యం దురాగతాలను తట్టుకోలేక..

స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్న తూర్పు పాకిస్థానీల పట్ల పాక్‌ సైన్యం అతి కిరాతకంగా వ్యవహరించింది. లక్షల మంది అమాయకులను బలితీసుకుంది. ఆర్మీ అకృత్యాలను తట్టుకోలేక జహీర్‌.. పాక్‌ విడిచి పారిపోయారు. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దును దాటి భారత్‌లోకి వచ్చారు. ఆ సమయంలో తన వద్ద కేవలం రూ. 20, ఒంటిపై ఉన్న దుస్తులు తప్ప మరేమీ లేవని జహీర్‌ ఓ సందర్భంలో తెలిపారు. ఆ తర్వాత భారత సైన్యాన్ని సంప్రదించారు. అయితే పాక్‌ నుంచి వచ్చేప్పుడు ఆ దేశ యుద్ధ ప్రణాళికలను తెలుసుకుని వచ్చారు.

బంగ్లా తరఫున రణరంగంలోకి..

పాక్‌ అరాచకాలను తట్టుకోలేని లక్షలాదిమంది.. తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ప్రజలు భారత్‌లోకి కాందీశీకులుగా తరలివచ్చారు. 1971 విముక్తి పోరాటంలో తూర్పు పాకిస్థాన్‌ యోధులకు భారత్‌ సైనికపరంగా సాయం చేసింది. స్వాతంత్య్ర పోరాట సంస్థ ముక్తి వాహినికి భారత ప్రభుత్వం ఆయుధాలు అందించింది. పాక్‌ నుంచి వచ్చిన తర్వాత జహీర్‌.. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర యుద్ధంలో చేరారు. ముక్తివాహనికి సహ కెప్టెన్‌గా పనిచేశారు. పౌరులకు సైనిక శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ముక్తివాహిని జడ్‌ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసి యుద్ధానికి సన్నద్ధం చేశారు. అలా తూర్పు పాకిస్థాన్‌ విముక్తికి పాటుపడ్డారు. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్‌ ఓడించగా.. తూర్పు పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం లభించి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది.

పాక్‌లో ఇప్పటికీ డెత్‌ వారెంట్‌..

జహీర్‌ దేశం విడిచి పారిపోయిన తర్వాత ఆయన కుటుంబం పాక్‌ ప్రభుత్వం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఢాకాలోని ఆయన ఇంటికి సైన్యం నిప్పుపెట్టింది. ఆయన తల్లి, కుమార్తెను పాక్‌ సైనికులు తరిమికొట్టారు. జహీర్‌పై పాకిస్థాన్‌ ఆర్మీ మరణశిక్ష విధించింది. ఇప్పటికీ అక్కడ ఆయనపై డెత్‌ వారెంట్‌ ఉంది. బంగ్లా స్వాతంత్య్రం కోసం వాటన్నింటినీ ఎదుర్కొని యుద్ధంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చేసిన కృషికి గానూ 2013లో బంగ్లా ప్రభుత్వం జహీర్‌ను అత్యున్నత పౌర పురస్కారం ఇండిపెండెన్స్‌ డే అవార్డ్‌తో సత్కరించింది. గతవారం భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.