అయోధ్య కేసులో చట్ట ప్రకారం తమకు జరగాల్సిన న్యాయం కోసమే పోరాడామని.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. 5 ఎకరాల భూమి కోసం కాదన్నారు.
అయోధ్య కేసులో సుప్రీం తీర్పు అనంతరం హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఓవైసీ. న్యాయస్థానం నిర్ణయంపై సంతృప్తిగా లేమని చెప్పారు.
"ఈ రోజు ఇచ్చిన తీర్పు.. నిజాలపై నమ్మకాల గెలుపు. సుప్రీం కోర్టు తీర్పు అంతిమమే.. కానీ అమోఘమేమీ కాదు. ముస్లిం లా బోర్డు సరిగ్గా చెప్పింది. మేం ఈ తీర్పుపై సంతృప్తిగా లేము."
-అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత
ఇదీ చూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం