ETV Bharat / bharat

బిహార్​ బరిలో ఎంఐఎం- ఎన్డీఏ నెత్తిన పాలు పోస్తుందా?

author img

By

Published : Oct 3, 2020, 4:43 PM IST

బిహార్​ ఎన్నికల పర్వాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పొత్తులు-పైఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. బిహార్​ బరిలో నిలిచిన అసదుద్దీన్​ ఓవైసీ పార్టీ ఎంఐఎం... తన బద్ధవిరోధ కూటమి ఎన్డీఏ నెత్తిన పాలు పోసే అవకాశాలు ఉన్నాయంటున్నారు బిహార్ ఈటీవీ భారత్ బ్యూరో చీఫ్​ అమిత్​ భెలారీ. ప్రతిపక్ష ఆర్జేడీ ముస్లిం ఓట్లను.. ఎంఐఎం చీల్చటం భాజపా మిత్రపక్షాలకు కలిసొస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Owaisi factor
బిహార్​ బరి: ఎంఐఎం పోటీ.. ఎన్డీఏ నెత్తిన పాలు పోస్తుందా ?

మజ్లిస్ పార్టీ​ బిహార్​లో​ పాగా వేసేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. 2020 శాసనసభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది. అయితే, అసదుద్దీన్ ఓవైసీ పార్టీ​ బిహార్​ పోరాటం, అధికార ఎన్డీఏకే కలిసొస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏఐఎంఐఎం బిహార్​లో ఇప్పటికే దేవేంద్ర ప్రసాద్ యాదవ్​- సమాజ్​వాదీ జనతా దల్​తో.. కలిసి యునైటెడ్ డెమోక్రటిక్​ సెక్యులర్​ కూటమిగా ఏర్పడింది. ఈ కూటమి ఆర్జేడీ, దాని మిత్రపక్షాల సంప్రదాయ ఓట్లు చీల్చేందుకు సన్నద్ధమైంది.

బిహార్​ బరిలోకి ఎంఐఎం దిగటం వల్ల.. హిందువుల మద్దతు భాజపాకు మరింత పెరగటమే కాకుండా, మైనార్టీల ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలన్నీ మతాల ప్రాతిపదికన ఓట్లను చీల్చేలా ఉన్నాయని, ఇది చేటు చేస్తుందని చెబుతున్నారు పరిశీలకులు.

మరోవైపు, ఓవైసీ ఫ్యాక్టర్​ ప్రధానంగా సీమాంచల్​ ప్రాంతంపై ఉంటుంది. కిషన్​గంజ్​, అరరియా, పూర్ణియా, కటిహార్​ నాలుగు జిల్లాల్లోని.. 24 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవిష్యత్తు కీలకం కానుంది. అయితే, బిహార్​లో దాదాపు 70 శాసనసభ స్థానాల్లో ముస్లింల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు ప్రతి జిల్లాలో వీరి జనాభా 15-25%గా ఉంది.

''ఓవైసీ ఫైర్​బ్రాండ్​ నేత, ఆయన ప్రభావం యువతను ఆకట్టుకోగలదు. వారంతా ఏళ్లుగా ఆర్జేడీ, కాంగ్రెస్​ తమను కేవలం ఓటు బ్యాంకులాగే చూశారన్న ఆగ్రహంతో ఉన్నారు. యువ ముస్లిం ఓటర్లు, ఓవైసీ భాషను ఆరాధిస్తున్నారు. అందుకే ఎంఐఎం.. ఆర్జేడీ కూటమిని దెబ్బతీయగలదు. ఇది చివరకు ఎన్డీఏ కూటమికే కలిసొస్తుంది.''

- పొలిటికల్​ సైన్స్​ అధ్యాపకులు, పట్నా విశ్వవిద్యాలయం

ఇదీ చూడండి: 'త్రీ గ్రేడ్' వ్యూహంతో బిహార్​ పోరుకు ఓవైసీ

మొత్తంగా బిహార్​ ఓటర్లలో ముస్లింల ప్రభావం 16% ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే.. స్వాతంత్ర్యం అనంతరం, ముస్లిం ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్​వైపు మొగ్గు చూపేవారు. 70ల వరకూ అంతాబాగానే సాగింది. ఎప్పుడైతే సంజయ్​ గాంధీ.. సామూహిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విధానం తీసుకొచ్చారో అప్పటినుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వానికి, కాంగ్రెస్​కు ముస్లింలను దూరం చేసింది.

ఆ సమయంలో జనతా పార్టీ ఇచ్చిన నినాదానికి విశేష ఆదరణ లభిచింది. 'ఇందిరా హఠావో, ఇంద్రియా బచావో' అనే నినాదాలతో ప్రజలు అంబులెన్సులు, ఆస్పత్రులకు దూరంగా పరుగెత్తిన రోజులు ఉన్నాయి. ఈ పరిణామాలతో ముస్లింలో భయం అలుముకుంది. అనంతరం జరిగిన 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ, సంజయ్​ గాంధీ ఓటమి పాలయ్యారు. కేంద్రంలోనే కాకుండా.. బిహార్​లోనూ కాంగ్రెస్​ అధికారం కోల్పోయింది. బిహార్​లో కర్పూరీ ఠాకూర్​ నేతృత్యంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.

ఆ తర్వాత.. అయోధ్యలో విశ్వ హిందూ పరిషత్​ కార్యక్రమాలు నిర్వహించేందుకునేందుకు రాజీవ్​ గాంధీ ప్రభుత్వం అనుమతించటం, భగల్​పుర్​ అల్లర్లను స్థానిక కాంగ్రెస్​ ప్రభుత్వం అడ్డుకోవటంలో విఫలమవ్వటం ముస్లింలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ పరిస్థితుల్లోనే చాలామంది మైనార్టీ ఓటర్లు.. హస్తాన్ని వీడి, లాలూ ఆర్జేడీ లాంతరు వద్దకు వచ్చారు. అయితే, ప్రస్తుతం రెండు పార్టీలూ వారి అభివృద్ధి డిమాండ్లను నెరవేర్చటంలో విఫలమయ్యాయనే భావనలో ఉన్నారు. ఈ తరుణంలో ఎంఐఎం ఎంట్రీ ఇవ్వటం రాజకీయ సమీకరణలను, మైనార్టీల మద్దతు అంశాలను పూర్తిగా మార్చేస్తోంది.

ఇదీ చూడండి: బిహార్ పోరు: ఆ పార్టీలు ఓట్లు చీల్చేందుకే పరిమితమా?

కిషన్​గంజ్​ వంటి జిల్లాల్లో.. దాదాపు 70శాతం ముస్లింలే ఉంటారు. ఇలాంటి చోట్ల భాజపాకు అవకాశాలు చాలా తక్కువ. అయితే, ఎంఐఎం... ఆర్జేడీ ఓట్లను చీల్చగలదు. ఇది పరోక్షంగా ఎన్డీఏకే కలిసి వచ్చేలా కనిపిస్తోంది.

ఇప్పటికైతే ఓవైసీ పార్టీ.. 2019 ఉప ఎన్నికల్లో కిషన్​గంజ్​ అసెంబ్లీ స్థానం గెలుచుకోవటం తప్ప బిహార్​లో సాధించిన గొప్ప విజయాలేం లేవు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం ప్రభావం.. బిహార్​ మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

''ఓవైసీ కేవలం అన్ని స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను నిలబెట్టరు. వారి గెలుపు సామర్థ్యాలను లెక్కవేస్తారు. గెలుపే లక్ష్యంగా పార్టీ విధివిధానాలు రూపొందిస్తున్నారు. వారికి ఎన్నికల్లో మంచి రికార్డు ఉంది. ఆ అనుభవంతో ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.''

- రాజకీయ విశ్లేషకుడు, బిహార్

అయితే, ఓవైసీ ప్రభావం బిహార్​ ఎన్నికలపై ఎంతమేరకు ఉంటుందనే అంశంపై స్పష్టమైన అంచనాకు రాలేని పరిస్థితి. కరోనా సంక్షోభంలో జరుగుతున్న ఈ కీలకమైన ఎన్నికల్లో ఎంఐఎం ఎంతమేర ఓట్లు చీల్చగలదనే విషయం మరికొన్ని రోజుల్లో తేలనుంది.

ఇప్పటికైతే 50 స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం కూటమి నిర్ణయించుకుంది. మరోవైపు తమ బలం పెంచుకునేందుకు, పప్పూ యాదవ్ ఏర్పాటు చేసిన ప్రోగ్రెసివ్​ డెమోక్రటిక్​ కూటమితోనూ సంప్రదింపులు జరుపుతోంది.

ఇదీ చూడండి: బిహార్​లో ఊసరవెల్లి రాజకీయాల ఉరవడి

ఇదీ చూడండి: బిహార్​ బరి: సీట్ల సర్దు'బాట'.. ఇట్లాగన్న మాట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.