ETV Bharat / bharat

జనజీవన స్రవంతిలోకి 65 మంది నక్సల్స్​

ఛత్తీస్​గఢ్ పోలీసుల ఎదుట గత 20 రోజుల్లో 65 మంది నక్లలైట్లు లొంగిపోయారు. పోలీసులు చేపట్టిన 'లోన్ వరాటు' (ఇంటికి తిరిగి రండి) కార్యక్రమమే ఇందుకు కారణం. లొంగిపోయిన నక్సల్స్​కు పునరావాసంతో పాటు ఉపాధి కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Jul 27, 2020, 4:34 PM IST

Over 65 Naxals 'return home' under Chhattisgarh Police's unique campaign
జనజీవన స్రవంతిలోకి 65 మంది నక్సల్స్​

ఛత్తీస్​గఢ్ పోలీసులు చేపట్టిన 'లోన్ వరాటు' కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోంది. దీనితో గత 20 రోజుల్లో 65 మంది నక్సల్స్... పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఇంటికి తిరిగి వచ్చారు...!

Over 65 Naxals 'return home' under Chhattisgarh Police's unique campaign
ఛత్తీస్​గఢ్ పోలీసుల రిటర్న్ టు హోం ప్రచారం

దంతెవాడ జిల్లాలోని చిక్పాల్ గ్రామంలో 20 రోజుల క్రితం పోలీసులు 'లోన్ వరాటు' (మీ ఇంటికి తిరిగి రండి) కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి గ్రామానికి వెళ్లి స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామస్థులకు ఫోన్ నంబర్లు ఇచ్చిన పోలీసులు... లొంగిపోవాలనుకునే నక్సల్స్ నేరుగా తమను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు 65 మంది లొంగిపోయారు. వీరిలో చాలా మందిపై లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

లొంగిపోయిన నక్సల్​తో మాట్లాడుతున్న అధికారులు

లొంగిపోయిన నక్సల్స్​కు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లొంగిపోయిన నక్సల్​కు ఆహార పదార్థాలు అందిస్తున్న పోలీసులు

స్వయం సహాయక సంఘాలు..

జులై 8న బజే గుజ్రాలో లొంగిపోయిన కొంతమంది నక్సల్స్... వ్యవసాయం చేసుకునేందుకు ట్రాక్టర్ కావాలని కోరారు. దీనితో అధికారులు స్వయం సహాయక బందాలు ఏర్పాటు చేసి, వారికి ట్రాక్టర్​ను మంజూరు చేశారు. మరో 10 మందికి ట్రాక్టర్​ సహా వ్యవసాయ పరికరాలు కూడా అందించారు.

2005 నుంచి నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి రావాలని ఛత్తీస్​గఢ్ పోలీసులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం, ఉపాధి కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.