ETV Bharat / bharat

రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో అలజడులకు పాక్​ కుట్ర!

author img

By

Published : Jan 24, 2021, 6:19 PM IST

Updated : Jan 24, 2021, 7:32 PM IST

tractor rally
రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో అలజడులకు పాక్​ కుట్ర!

18:13 January 24

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్​ కుట్ర పన్నినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై నిఘా సంస్థ నుంచి పక్కా సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దాదాపు 300కుపైగా పాకిస్థాన్​ ట్విట్టర్​ ఖాతాలను గుర్తించినట్టు స్పష్టం చేశారు.

"ఈ నెల 13 నుంచి 18 మధ్య పాకిస్థాన్​కు చెందిన 300కుపైగా ట్విట్టర్​ ఖాతాలను గుర్తించాం. రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాక్​ కుట్ర పన్నిందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ తరుణంలో ట్రాక్టర్​ ర్యాలీని నిర్వహించడం పెద్ద సవాలు. అయినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ర్యాలీ సాగుతుంది."

  --- దీపేంద్ర పాఠక్​, ప్రత్యేక పోలీస్​ కమీషనర్​

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని గతేడాది నవంబరు నుంచి దిల్లీ సరిహద్దుల్లో ఉద్ధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. దీనిలో భాగంగా టిక్రీ, సింఘు, గాజీపుర్​ సరిహద్దుల్లో భారీగా ట్రాక్టర్ ర్యాలీకి తలపెట్టారు.  

ట్రాక్టర్​ ర్యాలీని ఆపడానికి ప్రయత్నించిన దిల్లీ పోలీసులు.. రైతులతో నాలుగుసార్లు చర్చలు జరిపారు. అయితే చివరికి అనుమతిచ్చారు. 

Last Updated : Jan 24, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.