ETV Bharat / bharat

వందే భారత్​ మిషన్: స్వదేశానికి 3.6 లక్షల మంది - stranded indians

వందే భారత్​ మిషన్​ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 3.6 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. మొత్తం 5 లక్షల 13 వేల 47 మంది ఇందులో నమోదు చేసుకున్నట్లు తెలిపింది.

Over 3.6 lakh Indians returned to India after launch of Vande Bharat mission: MEA
వందే భారత్​ మిషన్ ద్వారా స్వదేశానికి 3.6లక్షల మంది
author img

By

Published : Jun 26, 2020, 10:04 AM IST

కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు మే 7న వందే భారత్​ మిషన్​ను ప్రారంభించింది కేంద్రం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 3 లక్షల 64 వేల 209 మందిని వివిధ దేశాల నుంచి భారత్​కు తరలించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

స్వదేశం వచ్చేందుకు మొత్తం 5 లక్షల 13 వేల 47 మంది నమోదు చేసుకున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ తెలిపారు. త్వరలోనే మిగతావారిని కూడా భారత్​కు తీసుకురానున్నట్లు చెప్పారు. సరిహద్దు చెక్​పాయింట్ల ద్వారా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ నుంచి 84,000 మందికిపైగా భారతీయులు స్వదేశానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

" వందే భారత్​ మిషన్ మొదటి మూడు విడతల్లో 875 విమానాల ద్వారా 50 దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశాం. ఇప్పటివరకు 700 విమానాల్లో లక్షా 50 వేల మంది భారత్​కు వచ్చారు. మూడో విడతలో మిగతా 175 విమానాలు భారతీయులను తరలిస్తాయి. మిగతా వారిని తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. గల్ఫ్​ దేశాలు, మలేషియా, సింగపూర్​లో ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాం. మా ప్రయత్నాలు కొనసాగేలా వందే భారత్​ మిషన్​ నాలుగో విడత జులై 3న ప్రారంభమవుతుంది. ఈ సారి ఎక్కువ మంది భారతీయులున్న దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. "

-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి.

ఈ విమానాలే కాకుండా మే 26 నుంచి ప్రత్యేక చార్టెడ్​ విమానాల ద్వారా భారతీయులను స్వదేశం తీసుకొచ్చినట్లు శ్రీ వాస్తవ వివరించారు. కొన్ని వారాలుగా వీటి సంఖ్య స్థిరంగా పెరిగినట్లు చెప్పారు. వీటి ద్వారా ఇప్పటివరకు లక్షా 30వేల 61మంది స్వదేశం చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చార్టెడ్​ విమానాలకు గల్ఫ్​ దేశాల్లో ఉన్న వారి నుంచి బాగా డిమాండ్​ ఉందన్నారు.

నావికా దళ ఓడలు కూడా విదేశాల్లో ఉన్న వారిని సముద్ర మార్గం ద్వారా భారత్​ తీసుకొచ్చినట్లు శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఐఎన్ఎస్​ జలశ్వా జూన్​ 24న ఇరాన్​లోని బందర్​ అబ్బాస్​ పోర్టు చేరుకుందని, భారతీయులతో అక్కడి నుంచి బయలు దేరిందని చెప్పారు.

ఇదీ చూడండి: కరోనా రికార్డ్:​ ఒక్కరోజులో 17,296 కేసులు, 407 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.