ETV Bharat / bharat

ఒకే ఐఎంఈఐ నంబరు​పై 13వేలకు పైగా ఫోన్లు! - 13,000 mobile phones same IMEI news

ఉత్తర్​ప్రదేశ్​లో ఒకే ఐఎంఈఐ నంబరుపై 13వేలకు పైగా మొబైల్​ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సదరు ఫోన్ల తయారీ సంస్థపై కేసు నమోదు చేశారు. ఇది తీవ్ర భద్రతా సమస్య అని, నేరస్థులకు ప్రయోజనకరంగా ఉండే ప్రమాదం ఉందన్నారు.

13,000 mobile phones found running on same IMEI
ఒకే ఐఎంఈఐ నెంబర్​పై 13వేల ఫోన్లు
author img

By

Published : Jun 5, 2020, 8:53 AM IST

Updated : Jun 5, 2020, 12:11 PM IST

మొబైల్ ఎన్ని సార్లు రిపేర్ చేయించినా సరిగ్గా పనిచేయడం లేదని కారణం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో కీలక విషయాన్ని గుర్తించారు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు. ఒక్క ఐఎంఈఐ నంబరుపై ఏకంగా 13వేల 500 ఫోన్లు వాడకంలో ఉన్నట్లు తెలిసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ ఫోన్ల తయారీ సంస్థపై కేసు నమోదు చేసి చర్యలకు ఉపక్రమించారు.

ఇది తీవ్రమైన భద్రతా సమస్య అని, ఫోన్ల తయారీ సంస్థ నిర్లక్ష్యం కారణంగా నేరస్థులకు ప్రయోజనం చేకూరుతుందని మేరఠ్​ నగర ఎస్పీ అఖిలేశ్​ సింగ్​ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఎలా తెలిసిందంటే..?

మేరఠ్​ పోలీస్ సిబ్బందిలోని ఒకరి ఫోన్ సరిగా పనిచేయడం లేదు. ఎన్ని సార్లు రిపేర్ చేయించినా ఫలితం లేదు. కారణం తెలుసుకునేందుకు ఫోన్​ను సైబర్ క్రైమ్​ విభాగానికి ఇచ్చారు. వాళ్లు దానిని పరీక్షించిన అనంతరం ఈ ఫోన్​కు ఉన్న ఐఎంఈఐ నంబరుతోనే మరో 13వేల 500 ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు.​

Last Updated : Jun 5, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.