ETV Bharat / bharat

టార్గెట్​ దీదీ: 100 మందికి పైగా వైద్యుల రాజీనామా - doctors

కోల్​కతాలోని ఎన్​ఆర్​ఎస్​ వైద్య కళాశాల, ఆసుపత్రి వైద్యులపై దాడికి నిరసనగా బంగాల్​ రాష్ట్రవ్యాప్తంగా 100 మందికిపైగా సీనియర్​ వైద్యులు రాజీనామా చేశారు. డాక్టర్ల సమ్మెకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. సమ్మె విరమించాలంటే సీఎం మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

టార్గెట్​ దీదీ: 100 మంది వైద్యుల రాజీనామా
author img

By

Published : Jun 14, 2019, 8:58 PM IST

Updated : Jun 14, 2019, 11:08 PM IST

టార్గెట్​ దీదీ: 100 మందికి పైగా వైద్యుల రాజీనామా

బంగాల్​ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్​కతాలోని ఎన్​ఆర్​ఎస్​ వైద్య కళాశాల జూనియర్​ వైద్యులపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల సీనియర్​ డాక్టర్లు సుమారు 100 మందికి పైగా రాజీనామాలు చేశారు.

ప్రధాన వైద్య కళాశాలల అధినేతలు, డాక్టర్లు.. కోల్​కతా, బుర్ద్వాన్​, డార్జిలింగ్​, ఉత్తర 24 పరగణాల జిల్లాలకు చెందిన 100 మందికి పైగా డాక్టర్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి రాజీనామాలు సమర్పించారు.

''ఎన్​ఆర్​ఎస్​ వైద్య కళాశాల, ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న డాక్టర్లపై దాడికి నిరసనగా... మేం వైద్యుల సమ్మెకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. మా భద్రత, రక్షణ డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ''
- డా. పి. కుందు, కలకత్తా స్కూల్​ ఆఫ్​ ట్రోపికల్​ మెడిసిన్​ డైరెక్టర్​

ప్రస్తుత పరిస్థితుల్లో కనీస సిబ్బంది లేకుండా నిరవధికంగా తమ సేవలు కొనసాగించలేమని రాజీనామా లేఖలో తెలిపారు. ఎన్​ఆర్​ఎస్​ వైద్య కళాశాల ప్రిన్సిపల్​, మెడికల్​ సూపరింటెండెంట్​లు​ గత రాత్రే రాజీనామాలు సమర్పించారు.

మమత క్షమాపణలు చెప్పాల్సిందే...

సమ్మె విరమించాలంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బేషరతు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్​ చేశారు వైద్యులు. మరో ఆరు డిమాండ్లను పరిష్కరించాలని మమత ముందుంచారు. వాటిని పరిష్కారానికి హామీ ఇస్తేనే.. తిరిగి విధుల్లోకి చేరుతామని తేల్చిచెప్పారు.

మమతా బెనర్జీ ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఆమె బేషరతు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు వైద్యులు.

''గాయపడ్డ వైద్యులను మమత పరామర్శించాలి. దాడిని ఖండిస్తూ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేయాలి. దాడి చేసిందెవరో కనిపెట్టి చర్యలు తీసుకోవాలి'' వంటి ఆరు షరతుల్ని ప్రభుత్వం ముందుంచారు వైద్యులు.

ఇదీ వివాదం...

కోల్​కతాలోని ఎస్​ఎస్​కేఎం ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై బంధువులు దాడి చేశారు. నిరసనగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.

గురువారం జూనియర్ డాక్టర్లను హెచ్చరించారు బంగాల్​ ముఖ్యమంత్రి. 4 గంటల్లోగా విధుల్లోకి చేరాలని హుకుం జారీ చేశారు. ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో బయటివారు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైద్యుల సమ్మె భాజపా, సీపీఎంల కుట్ర అని ఆరోపించారు మమత.

ఇదీ చూడండి: 'బంగాల్​లో ఉండాలంటే బెంగాలీ నేర్చుకోవాల్సిందే'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tel Aviv - 14 June 2019
1. Two revellers in costumes made from balloons at pride parade
2. Reveller posing
3. Parade performer dancing on float
4. SOUNDBITE (English) Elisete Retter, Tel Aviv resident and parade performer:
"I feel great because this day is very important to all over the world, because the gay rights have to be acknowledged, finally. And I'm from Brazil and I feel like I'm in a big carnival and I love the gay community and I am a straight woman but, I am an activist for the gay community."
5. Retter on float
6. SOUNDBITE (English) Dale Carlson, American tourist:
"I think it's great that my visit here to Israel coincides with the Gay Pride Week and the parade. I'm really looking forward to seeing people come together with love and support of LGBT rights and especially here in Israel. This is an honour to be here."
7. Wide of revellers and stage in background, pan to street full of revellers
8. Various of revellers dancing
9. Revellers hugging
10. Revellers dancing
11. Woman posing to camera
12. Women walking with babies in baby carriers
13. Police officer riding
STORYLINE
The largest gay pride parade in the Middle East drew hundreds of thousands of revellers to the streets of Tel Aviv in Israel on Friday.
Rainbow-clad marchers streamed through the coastal city, posing for selfies and beating drums, while shirtless men kissed on floats blasting electro beats.
Support for gay rights is increasingly widespread in Israel, where gay people serve openly in the military and parliament, but they have not yet achieved full equality.
Elisete Retter, a Tel Aviv resident and parade performer, said it was an "important day" as "gay rights have to be acknowledged".
Broad cultural acceptance for the community has helped Israel emerge as one of the world's most gay-friendly travel destinations, with secular Tel Aviv in particular celebrated as a hub of gay culture, in sharp contrast to the rest of the Middle East where LGBT visibility is often not tolerated or persecuted.
American tourist Dale Carlson said it was an "honour" to be able to witness the parade while on a visit to the country.
Israel's reputation as an LGBT haven has caused critics to accuse the country of "pink washing," or using its tolerance for liberal gay culture as a branding tool to conceal its violations of Palestinian rights.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 14, 2019, 11:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.